IND vs SA Aiden Markram Record In World Cups: భారత్​ను భయపెడుతున్న మార్క్రమ్ రికార్డు.. అతడు పట్టిందల్లా బంగారమే!

Aiden Markram: భారత్​ను భయపెడుతున్న మార్క్రమ్ రికార్డు.. అతడు పట్టిందల్లా బంగారమే!

మెగా ఫైనల్​కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో భారత్-సౌతాఫ్రికా మధ్య పొట్టి కప్పులో ఆఖరి పోరు జరగనుంది. కప్పు కోసం ఇరు జట్లు కొదమసింహాల్లా పోరాడేందుకు సమాయత్తం అవుతున్నాయి.

మెగా ఫైనల్​కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో భారత్-సౌతాఫ్రికా మధ్య పొట్టి కప్పులో ఆఖరి పోరు జరగనుంది. కప్పు కోసం ఇరు జట్లు కొదమసింహాల్లా పోరాడేందుకు సమాయత్తం అవుతున్నాయి.

మెగా ఫైనల్​కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో భారత్-సౌతాఫ్రికా మధ్య పొట్టి కప్పులో ఆఖరి పోరు జరగనుంది. కప్పు కోసం ఇరు జట్లు కొదమసింహాల్లా పోరాడేందుకు సమాయత్తం అవుతున్నాయి. ప్రేక్షకులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. టీమిండియా కప్పు గెలవాలని కలలు గన్న అభిమానులు.. ఆ క్షణాలను లైవ్​లో చూడనున్నారు. మెగాటోర్నీలో ఓటమి అనేదే లేకుండా ఫైనల్​కు చేరుకున్న రోహిత్ సేన.. ప్రొటీస్​ను కూడా మట్టికరిపిస్తే కప్పు మనదే అవుతుంది. సఫారీలు కూడా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండానే తుదిపోరుకు క్వాలిఫై అయ్యారు. దీంతో ఇవాళ టఫ్ కాంపిటీషన్ తప్పేలా లేదు. రెండు జట్ల నిండా స్టార్లు ఉండటం, ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే బిగ్ హిట్టర్లు ఉండటంతో ఎవరు గెలుస్తారని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

సౌతాఫ్రికా బలంగానే ఉన్నా ఫైనల్ మ్యాచ్​లో టీమిండియా ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది. ఎందుకంటే వరల్డ్ కప్స్​లో ఏనాడూ సెమీస్ దాటని ప్రొటీస్.. చోకర్స్​గా ముద్రవేసుకుంది. సెమీస్​లో తడబడి ఇంటికి వెళ్లడం వాళ్లకు అలవాటుగా మారింది. అలాంటిది తొలిసారి ఫైనల్స్​కు చేరుకోవడంతో ఆ టీమ్ మరింత ప్రెజర్​లో కనిపిస్తోంది. అటు భారత్​కు ఫైనల్ మ్యాచ్​లు ఆడటం అలవాటే. కొన్నిమార్లు విజయం, ఇంకొన్నిసార్లు పరాజయం పాలైనా తుదిపోరులో ఆడిన అనుభవం మాత్రం మన టీమ్​కు ఉంది. కాబట్టి మ్యాచ్ మొదట్లో సఫారీలను ప్రెజర్​లోకి నెట్టగలిగితే విజయం సులువవుతుంది. అయితే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పరంగా సౌతాఫ్రికా కంటే బలంగా కనిపిస్తున్న రోహిత్ సేన.. ఓ విషయంలో మాత్రం ఆ జట్టుతో భయపడుతోంది. ప్రొటీస్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ రికార్డే దీనికి కారణం.

కెప్టెన్​గా మార్క్రమ్​కు అద్భుతమైన రికార్డు ఉంది. అతడు సౌతాఫ్రికాను సమర్థంగా ముందుకు నడిపిస్తున్నాడు. అతడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. వరల్డ్ కప్స్​లో అతడి సారథ్యానికి తిరుగులేదు. 2014లో అండర్-19 ప్రపంచ కప్​లో అతడి కెప్టెన్సీలో ప్రొటీస్ జట్టు 6 మ్యాచుల్లో 6 విజయాలు సాధించింది. అలాగే కప్పును ఎగరేసుకుపోయింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో సఫారీ టీమ్​కు స్టాండ్-ఇన్ కెప్టెన్​గా వ్యవహరించాడు మార్క్రమ్. ఆ టోర్నీలో అతడి సారథ్యంలో ఆడిన రెండు మ్యాచుల్లో జట్టు విజయఢంకా మోగించింది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్​-2024లో మార్క్రమ్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా జట్టు ఆడిన 8 మ్యాచుల్లోనూ గెలిచింది. ఓటమి అనేదే లేకుండా ఫైనల్​కు చేరుకుంది. మొత్తంగా చూస్తే మార్క్రమ్ సారథ్యంలో వరల్డ్ కప్స్​లో సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్​లో కూడా ఓడిపోలేదు. దీంతో ఈ సెంటిమెంట్ రిపీటైతే భారత్​కు కప్పు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. మార్క్రమ్ కెప్టెన్సీ సెంటిమెంట్​ను భారత్ చిత్తు చేస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments