Nidhan
వన్డే సిరీస్ మనదే అయింది. ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి సిరీస్ పట్టేశారు భారత కుర్రాళ్లు. చివరి వన్డేలో టీమిండియా విజయానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వన్డే సిరీస్ మనదే అయింది. ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి సిరీస్ పట్టేశారు భారత కుర్రాళ్లు. చివరి వన్డేలో టీమిండియా విజయానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Nidhan
సఫారీ టూర్లో భారత్ తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్, మినీ ఆక్షన్ హడావుడిలో ఈ సిరీస్ గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు. కానీ యంగ్‌స్టర్స్‌తో కూడిన టీమిండియా.. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, మంచి బౌలింగ్ యూనిట్ కలిగిన ప్రొటీస్‌ను మట్టికరిపించిన తీరు హైలైట్ అనే చెప్పాలి. గత పర్యటనలో ఇదే కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఫుల్ స్ట్రెంగ్త్‌తో ఆడినా సిరీస్ ఓడిన భారత్.. ఈసారి యువకులతో వచ్చి సౌతాఫ్రికాను చిత్తు చేసింది. గెలవాలన్న కసి, బాగా ఆడాలన్న పట్టుదలే దీనికి కారణమని చెప్పాలి. ఇక, ఆఖరి వన్డేలో భారత్ విజయానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చివరి వన్డేలో టీమిండియా సక్సెస్‌కు ప్రధాన కారణం బ్యాటింగ్. ఈ మ్యాచ్‌లో మన బ్యాటర్లు బాగా పెర్ఫార్మ్ చేశారు. నయా ఓపెనర్లు రజత్ పాటిదార్ (22), సాయి సుదర్శన్ (10) క్విక్ స్టార్ట్ అందించారు. వీళ్లు త్వరగా ఔటైనా స్లో పిచ్ మీద ఇది మంచి ఆరంభమనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ (108) కెరీర్లో ఫస్ట్ సెంచరీతో చెలరేగాడు. కేఎల్ రాహుల్ (21), తిలక్ వర్మ (52)తో కలసి మంచి పార్ట్నర్షిప్స్ నమోదు చేశాడు. స్లోగా ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేస్తూ పోయిన సంజూకు తిలక్ సహకారం అందించాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) బిగ్ షాట్స్ ఆడటం, అతడికి తోడు టెయిలెండర్లూ తలో చేయి వేయడంతో ప్రొటీస్ ముందు 296 రన్స్ బిగ్ టార్గెట్‌ను ఉంచగలిగింది భారత్.
భారత్ విజయంలో మరో ప్రధాన కారణం సంజూ శాంసన్ ఇన్నింగ్స్. స్లో పిచ్ మీద బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. గ్రౌండ్ పెద్దగా ఉండటంతో భారీ షాట్స్ ఆడితే క్యాచ్‌లు అయ్యే ప్రమాదం ఉంది. వికెట్ నుంచి పేస్, స్పిన్‌కు సపోర్ట్ దొరకడంతో ఒక్కో రన్ చేసేందుకు బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. ఫస్ట్ డౌన్లో వచ్చిన సంజూ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. బర్గర్, హెండ్రిక్స్ బౌలింగ్‌లో అతడు కొన్ని పుల్ షాట్స్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి. వాళ్లిద్దరితో పాటు సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్నూ దీటుగా ఎదుర్కొని రన్స్ చేశాడు సంజూ. చాన్నాళ్ల తర్వాత వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకొని శతకం సాధించాడు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెలక్షన్ రేసులో తానూ ఉన్నానని చాటాడు. టీమిండియా విజయానికి మూడో కారణం బౌలింగ్. బోల్డన్ పార్క్ స్టేడియంలోని పిచ్ నుంచి పేసర్లు, స్పిన్‌కు మద్దతు దొరికింది. కానీ పిచ్ మీద పెద్దగా బౌన్స్ లేదు. దీంతో అర్ష్‌దీప్ సింగ్ (4/30) తన బలమైన స్వింగ్, స్లో బాల్స్‌ను నమ్ముకొని సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
అర్ష్‌దీప్‌కు తోడుగా అవేశ్ ఖాన్ (2/45), ముకేశ్ కుమార్ (1/56) రాణించడంతో భారత్‌కు తిరుగులేకపోయింది. ముకేశ్ ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ గాల్లో బాల్‌ను స్వింగ్ చేస్తూ సౌతాఫ్రికా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. దీని వల్ల మిగతా బౌలర్లకు వికెట్లు పడ్డాయి. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (2/38), అక్షర్ పటేల్ (1/48) కీలక వికెట్లు తీసి గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపునకు మరో కారణం కెప్టెన్సీ. ఈ సిరీస్ మొత్తం ఎంతో ఇన్వాల్వ్డ్గా కనిపించిన కేఎల్ రాహుల్.. ఆఖరి మ్యాచ్‌లో మరింత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో ఫెయిలైనా సారథ్యంతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కీపింగ్ బాధ్యతలు తీసుకొని వికెట్ల వెనుక నుంచి వ్యూహాలు రచిస్తూ, బౌలర్లకు సలహాలు ఇస్తూ కనిపించాడు. డీఆర్ఎస్ విషయంలోనూ బౌలర్లకు సపోర్ట్‌గా ఉండి సక్సెస్ అయ్యాడు. పిచ్ నుంచి రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లకు కాస్త ఎక్కువ మద్దతు లభించడమూ భారత్ విజయానికి మరో కారణంగా చెప్పొచ్చు. మరి.. వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా గెలుపునకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs SA: KL రాహుల్ అరుదైన ఘనత.. 14 ఏళ్ల తర్వాత
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 🏆
Congratulations to the @klrahul-led side on winning the #SAvIND ODI series 2-1 👏👏#TeamIndia pic.twitter.com/QlaAVLdh6P
— BCCI (@BCCI) December 21, 2023