సౌతాఫ్రికా సిరీస్‌కు టీమిండియా రెడీ అయిపోయింది. అయితే ఆ సిరీస్‌లో టీ20 టీమ్‌లో ఆడకుండా విరాట్ కోహ్లీ తప్పు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
సౌతాఫ్రికా సిరీస్‌కు టీమిండియా రెడీ అయిపోయింది. అయితే ఆ సిరీస్‌లో టీ20 టీమ్‌లో ఆడకుండా విరాట్ కోహ్లీ తప్పు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
సౌతాఫ్రికా టూర్‌కు టీమిండియా రెడీ అయిపోయింది. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ పర్యటన డిసెంబర్ 10వ తేదీన జరిగే తొలి టీ20తో మొదలుకానుంది. జనవరి 7వ తేదీన ఈ టూర్ ముగిసిపోతుంది. సఫారీ గడ్డపై మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది భారత్. ఈ సిరీస్‌లో మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లకు నియమించారు సెలక్టర్లు. పొట్టి ఫార్మాటైన టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలను మోయనున్నారు. ఈ పర్యటనలో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు రోహిత్‌తో పాటు స్టార బ్యాటర్ విరాట్ కోహ్లీ, వెటరన్ పేసర్ మహ్మద్ షమి దూరంగా ఉండనున్నారు. లిమిటెడ్ ఓవర్స్ నుంచి వీళ్లు రెస్ట్ తీసుకున్నారు. ఇంజ్యురీతో బాధపడుతున్న షమి.. టెస్టుల్లోనూ ఆడే అవకాశం కనిపించడం లేదు. సిరీస్ మొదలయ్యే టైమ్‌కు కోలుకున్నా ఆడిస్తారని చెప్పలేం. దీర్ఘ కాలంలో అతడి అవసరం జట్టుకు ఉంది కాబట్టి ఆడించకపోవచ్చు.
సౌతాఫ్రికా సిరీస్‌లో టీ20లు, టెస్టులకు టీమిండియా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. టీ20 వరల్డ్ కప్‌కు ఎక్కువ టైమ్ లేదు కాబట్టి ఇప్పటి నుంచే టీమ్ కాంబినేషన్‌ను సెట్ చేసుకుంటోంది. యంగ్ ప్లేయర్స్‌ను పరీక్షిస్తోంది. ఆస్ట్రేలియాతో ఇటవల ముగిసిన 5 టీ20ల సిరీస్‌లో కొందరు ఆటగాళ్లు రాణించారు. సఫారీ సిరీస్‌లోనూ వాళ్లు అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే టీ20 స్క్వాడ్‌లో తమ ప్లేస్‌ను ఫిక్స్ చేసుకోవచ్చు. వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియాకు రోహితే కెప్టెన్‌గా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి మెగా టోర్నీలో అతడికి జతగా ఎవరు ఆడతారనేది కీలకం. ఇటీవల వన్డే వరల్డ్ కప్‌లో శుబ్‌మన్ గిల్ ఆడినా అంతగా ఆకట్టుకోలేదు. ఆసీస్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్న యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్ తన ఫామ్‌ను కొనసాగిస్తే హిట్‌మ్యాన్‌తో కలసి ఓపెనింగ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది.
కంగారూలతో సిరీస్‌లో రాణించిన రింకూ సింగ్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ మళ్లీ తమ సత్తాను చాటుకోవాలి. బౌలింగ్‌లో వికెట్లు తీసినా ఎక్కువ రన్స్ ఇచ్చుకున్న అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ కూడా బాగా ఆడాల్సి ఉంది. ఇలా యువకులు అందరికీ ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. అయితే సౌతాఫ్రికాతో టీ20లు, వన్డే సిరీస్‌లకు కింగ్ కోహ్లీ దూరమవ్వడం మాత్రం టీమ్‌ను దెబ్బతీసేలా ఉంది. సఫారీ గడ్డపై విరాట్ వన్డే యావరేజీ 76.38గా ఉంది. అదే టెస్టుల్లో అతడి యావరేజీ 51.36గా ఉంది. వన్డేల్లో ఇంత మంచి యావరేజీ ఉన్న కోహ్లీ ఆడకపోవడం టీమ్‌ను ఇబ్బంది పెట్టక మానదు. యువకులతో నిండి ఉన్న టీ20 స్క్వాడ్‌లో విరాట్ ఉండి ఉంటే జట్టు మరింత పటిష్టంగా తయారయ్యేది. అతడితో కలసి ఆడటం వల్ల యువ ఆటగాళ్లు కూడా ఎంతో నేర్చుకునేవారు.
సౌతాఫ్రికాలో ఎలా ఆడాలో కిటుకు తెలుసు కాబట్టి మరిన్ని సెంచరీలు కొట్టేందుకు, రికార్డులు బ్రేక్ చేసేందుకు విరాట్‌కు ఛాన్స్ ఉండేది. రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో అతడు టీమ్ నుంచి తప్పుకున్నాడు. ఆసియా కప్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్‌లో తీవ్రంగా అలసిపోయాడు కోహ్లీ. అతడి వయసు కూడా 36 ఏళ్లు. కాబట్టి ప్రతి టోర్నమెంట్లో ఆడమని ఇబ్బంది పెట్టలేని పరిస్థితి. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీల్లో విరాట్‌ను ఆడించాలంటే అతడ్ని కాపాడుకోవాలి. అలాగే ఫ్రెష్‌గా ఉంచుకోవాలి. బహుశా అందుకే అతడు రెస్ట్ తీసుకుంటానంటే బోర్డు కూడా ఎస్ చెప్పిందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం విరాట్ వన్డే, టీ20 సిరీస్‌ల్లో ఆడాల్సిందని అంటున్నారు. రికార్డులు నమోదు చేసే ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వన్డే, టీ20 సిరీస్‌ల్లో ఆడొద్దని కోహ్లీ తీసుకున్న నిర్ణయం సరైందని మీరు భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs SA: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన కలిస్.. అంత సీన్ లేదంటూ..!
King Kohli loves playing in South Africa! 👑#ViratKohli #Cricket #SAvIND #India #Sportskeeda pic.twitter.com/gLhtkAELIc
— Sportskeeda (@Sportskeeda) December 8, 2023