వన్డే వరల్డ్ కప్-2023లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌కు అంతా రెడీ అయిపోయింది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ తలపడబోయేది ఇవాళే. దాదాపు లక్షా ముప్పై వేల సీటింగ్ కెపాసిటీతో దునియాలోనే అతిపెద్ద స్టేడియంగా మారిన నరేంద్ర మోడీ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగబోతోంది. సొంత ప్రేక్షకుల నడుమ దాయాదితో పోరు అంటే టీమిండియాపై ఒత్తిడి ఏ మేర ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే గత రికార్డులు, ప్రస్తుత ఫామ్.. ఇలా చాలా విషయాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. వరల్డ్ కప్స్‌లో పాక్‌తో ఏడుసార్లు తలపడ్డ టీమిండియా అన్ని మ్యాచుల్లోనూ ఆ టీమ్‌ను ఓడించి అజేయ రికార్డును సొంతం చేసుకుంది.
ప్రపంచ కప్‌కు ముందు రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌లోనూ పాక్‌ను చిత్తు చేసింది రోహిత్ సేన. ఈ ఏడాది మెగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి ఫుల్ జోష్‌లో ఉంది భారత్. కాబట్టి అందరూ టీమిండియానే హాట్ ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. అటు పాక్ కూడా టోర్నీలో వరుసగా రెండు మ్యాచులు గెలిచింది. లంకపై రికార్డు టార్గెట్‌ను ఛేజ్ చేసి బాబర్ సేన కూడా ఊపు మీద ఉంది. ఆ టీమ్‌లోనూ పలు డేంజరస్ ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి పాక్‌ను తక్కువ అంచనా వేసేందుకు వీల్లేదు. పాక్‌తో మ్యాచ్‌కు ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కమ్‌బ్యాక్ ఇవ్వడం భారత్‌కు గుడ్ న్యూస్‌గా చెప్పాలి. డెంగ్యూ బారి నుంచి కోలుకున్న ఈ యంగ్ బ్యాటర్.. రెండ్రోజులుగా బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను ఇండియన్ ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ను ఎవరు గెలిపిస్తారో ఆ ఆటగాడే నేషనల్ హీరో అయిపోతాడు. ఇటీవల కాలంలో చూసుకుంటే.. 2015 వరల్డ్ కప్‌లో పాక్‌పై కోహ్లీ సెంచరీని మర్చిపోలేం. అలాగే 2019లో రోహిత్ ఇన్నింగ్స్‌నూ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈసారి వీళ్లిద్దరితో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే రికార్డుల పరంగా చూసుకుంటే ఈసారి హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో హీరో అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే చాలు హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి ఆడతాడు. ఇప్పటిదాకా దాయాదిపై వన్డేల్లో 4 ఇన్నింగ్స్‌లో 209 రన్స్ చేశాడు పాండ్యా. ఈ నాలుగు వన్డేల్లో అతడి స్ట్రయిక్ రేట్ 132.21గా ఉంది. బ్యాటుతోనే కాదు బంతితోనూ పాక్‌పై హార్దిక్‌కు మంచి రికార్డే ఉంది. ఆ టీమ్‌పై 5 ఇన్నింగ్స్‌ల్లో 6 వికెట్లు తీశాడీ ఆల్‌రౌండర్. గతేడాది ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్ మ్యాచ్‌లో పాక్‌పై లాస్ట్ బాల్‌కు ఫోర్ కొట్టి గెలిపించాడు పాండ్యా. ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీతో కలసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌లో గ్రూప్ మ్యాచ్‌లో ఒక దశలో టీమిండియా వెంట వెంటనే 4 వికెట్లు కోల్పోయింది. ఆ టైమ్‌లో ఇషాన్ కిషన్‌తో కలసి టీమ్‌ను నిలబెట్టాడు పాండ్యా. పాక్‌పై బ్యాట్, బాల్‌తో మంచి రికార్డు ఉన్న పాండ్యా.. ఫీల్డింగ్‌లోనూ విలువైన రన్స్‌ను కాపాడటంతో పాటు క్యాచింగ్‌లోనూ కీలకం కానున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న పాండ్యాకు ఇండో-పాక్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ గ్రౌండ్లో ఎలా ఆడాలో బాగా తెలుసు. కాబట్టి ఈ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ కంటే అతడే కీలకం కానున్నాడని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మరి.. ఇండో-పాక్ సమరంలో ఎవరు హీరోగా నిలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇండియా-పాక్ మ్యాచ్.. హిస్టరీ రిపీట్ అన్న అక్తర్! ఆడేసుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్..