రేపు ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ వన్డే మ్యాచ్‌! ఎక్కడంటే?

క్రికెట్‌ ప్రపంచంలో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కున్న క్రేజ్‌ గురించి మాటల్లో చెప్పలేం. అది క్రికెట్‌కు మించి ఉంటుంది. రెండు దేశాల మధ్య ఉన్న వైరం నేపథ్యంలో దాన్నో క్రికెట్‌ మ్యాచ్‌లా కాకుండా మినీ యుద్ధంలా ఇరు దేశాల అభిమానులు భావిస్తారు. పాకిస్థాన్‌పై ఇండియా గెలిస్తే.. భారత్‌లో సంబురాలు పాక్‌లో నిరసనలు. ఇండియాపై పాక్‌ గెలిస్తే సేమ్‌ సీన్లు రివర్స్‌లో జరుగుతాయి. రెండు దేశాల్లోనూ క్రికెటర్లను డెమీ గాడ్స్‌లా ఆరాధిస్తారు. ఎంత నెత్తిన పెట్టుకుంటారో.. ఓటమి ఎదురైనప్పుడూ అంతా ద్వేషిస్తారు.

మిగతా ఏ దేశంపైనైనా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో చెత్త ప్రదర్శన చేసి ఓడినా.. వీ ఆర్‌ విత్‌ యూ అంటూ అండగా నిలబడతారు. కానీ, పాక్‌పై లీగ్‌ మ్యాచ్‌లో ఓడినా.. భారత క్రికెట్‌ అభిమానులు భరించలేదు. పాక్‌లో అంతే.. ఎవరితో ఓడినా అక్కడి క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఫరక్‌ పడదు కానీ, భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓడిపోకూడదు. కానీ, ఆటంటే గెలుపు ఓటమి ఉంటాయి. కచ్చితం ఒక జట్టు ఓడిపోతుంది. ఆ రోజు ఏ టీమ్‌ ఉత్తమ ప్రదర్శన ఇస్తుందో వారిదే విజయం. ఇండియా-పాకిస్థాన్‌ పోరులో ఎక్కువగా ఇండియాదే పైచేయిగా ఉంటుంది.

ముఖ్యంగా వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలో పాక్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డ్‌ ఉంది. ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్‌లు ఎలాగో జరగడం లేదు కాబట్టి.. ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌ టోర్నీల్లోనే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరుగుతున్నాయి. దీంతో ఈ పోరుకు భారీగా క్రేజ్‌ ఏర్పడింది. దీంతో ఎప్పుడెప్పుడు ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరుగుతుందని ఇరు దేశాల క్రికెట్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచ దేశాల క్రికెట్‌ అభిమానులు సైతం ఎదురుచూస్తుంటారు. అయితే.. సీనియర్‌ టీమ్సే కాకుండా.. భారత్‌-పాక్‌ జూనియర్‌ క్రికెట్‌ టీమ్స్‌ తలపడినా.. క్రికెట్‌ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఆసియా ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023 టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో ఫ్యూచర్‌ స్టార్ట్‌ క్రికెటర్లతో అన్ని జట్లు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో టీమిండియా-ఏ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే.. లీగ్‌ దశలో రేపు(బుధవారం, జులై 19) పాకిస్థాన్‌తో తలపడనుంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌-ఏ జట్టు సైతం రెండు విజయాలతో మంచి ఊపులో ఉంది. మరి ఇప్పటి వరకు ఓటమి లేకుండా ఉన్న రెండు జట్ల మధ్య పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తండ్రైన టీమిండియా క్రికెటర్‌! ధోని బర్త్‌డే కూడా అదేరోజు

Show comments