Nidhan
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి ప్లేసులో ఓ ఆర్సీబీ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఒక్క ఛాన్స్ కోసం ఆశిస్తున్న వాళ్లిద్దరికీ మాత్రం మళ్లీ మొండిచేయి చూపారు సెలక్టర్లు.
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి ప్లేసులో ఓ ఆర్సీబీ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఒక్క ఛాన్స్ కోసం ఆశిస్తున్న వాళ్లిద్దరికీ మాత్రం మళ్లీ మొండిచేయి చూపారు సెలక్టర్లు.
Nidhan
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు అంతా రెడీ అయింది. ఈ టాప్ టీమ్స్ మధ్య రేపటి నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టెస్ట్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్స్‌కు చేరుకోవాలంటే ఈ సిరీస్‌లో నెగ్గడం రెండు జట్లకూ చాలా కీలకంగా మారింది. అందుకే ఈ సిరీస్‌ను భారత్-ఇంగ్లండ్ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అయితే తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఇంగ్లండ్ బజ్‌బాల్ ఫార్ములాను అతడు చిత్తు చేస్తాడని అంతా గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే పర్సనల్ రీజన్స్ వల్ల హఠాత్తుగా ఇంటికి వెళ్లిపోయాడు కింగ్. సిరీస్‌లోని మిగతా మూడు మ్యాచులకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. దీంతో కోహ్లీ ప్లేస్‌ను ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే విరాట్ స్థానంలో ఆర్సీబీ ప్లేయర్ రజత్ పాటిదార్‌ను జట్టులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
కోహ్లీ ప్లేసులో రజత్ పాటిదార్‌ను తీసుకోవడం దాదాపుగా కన్ఫర్మ్ అయిందట. సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆప్షన్లు ఉన్నా రజత్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారని తెలిసింది. ఇటీవల ఇంగ్లండ్-ఏ జట్టుతో జరిగిన టెస్టులో భారీ సెంచరీ చేయడం అతడికి బిగ్ ప్లస్‌గా మారిందని అంటున్నారు. అయితే టీమ్‌లో చోటు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వెటరన్ ప్లేయర్లు పుజారా, అజింక్యా రహానేతో పాటు యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్‌కు మరోమారు మొండిచేయి చూపినట్లు అర్థమవుతోంది. రహానె సరైన ఫామ్‌లో లేడు. రంజీ ట్రోఫీ-2024లో అతడు దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. కానీ పుజారా మాత్రం బాగా ఆడుతున్నాడు. రీసెంట్గా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ కూడా బాదాడు. అయినా అతడ్ని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. డొమెస్టిక్ క్రికెట్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్‌కు మొండిచేయి చూపారని అర్థమవుతోంది.
రజత్ పాటిదార్ సెలక్షన్‌పై బీసీసీఐ మరికొంత సేపట్లో అధికారిక ప్రకటన చేస్తుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో వెటరన్ క్రికెటర్లు పుజారా, రహానె శకం ఇక ముగిసినట్లేనని చెబుతున్నాయి. ఇంక వాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌కే పరిమితం అవుతారని కామెంట్స్ చేస్తున్నాయి. పుజారా, రహానె విషయాన్ని పక్కనబెడితే ఇంతగా రాణిస్తున్నా సర్ఫరాజ్‌ను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదనేది చాలా మందికి అర్థం కావట్లేదు. అయితే ఫిట్నెస్, అధిక బరువు లాంటి కారణాల వల్లే అతడికి సెలక్టర్లు మొండిచేయి చూపిస్తున్నారని కొందరు అనలిస్టులు చెబుతున్నారు. ఒకవేళ బరువు తగ్గించుకొని ఫిట్‌గా మారితే అతడి అరంగేట్రం ఖాయమని చెబుతున్నారు. ఇక, కోహ్లీ ప్లేసులో ఎవర్ని టీమ్‌లోకి తీసుకున్నా తుదిజట్టులో చోటు మాత్రం కష్టమే. విరాట్ స్థానంలో శుబ్‌మన్ గిల్ దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. కోహ్లీ స్థానంలో రజత్ పాటిదార్‌ను తీసుకోనున్నారనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rajat Patidar has replaced Virat Kohli for the first two Tests against England. (Cricbuzz). pic.twitter.com/3o4ndoSqb9
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 24, 2024