Virat Kohli: కోహ్లీ ఆడకపోతే భారత్​కు పోయేదేమీ లేదు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడకపోతే భారత్​కు నష్టం ఏమీ లేదన్నాడు ఓ మాజీ క్రికెటర్. అతడు ఆడకపోతే క్రికెట్ ఆగిపోదన్నాడు.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడకపోతే భారత్​కు నష్టం ఏమీ లేదన్నాడు ఓ మాజీ క్రికెటర్. అతడు ఆడకపోతే క్రికెట్ ఆగిపోదన్నాడు.

పర్సనల్ రీజన్స్ వల్ల ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అంతకుముందు ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​లోనూ ఇలాగే వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా ఇలాగే టీమ్​కు దూరమవడంతో అసలు అతడికి ఏమైందని అందరూ ఆలోచించసాగారు. ఇంగ్లండ్​తో చివరి మూడు టెస్టుల వరకైనా అతడు టీమ్​తో కలుస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రీసెంట్​గా స్క్వాడ్​ను ప్రకటించిన సెలక్షన్ కమిటీ.. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ విరాట్ ఆడటం లేదని తెలిపింది. అతడు వ్యక్తిగత కారణాలతో పూర్తి సిరీస్ నుంచి వైదొలిగాడని స్పష్టం చేసింది. కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. అయితే విరాట్ లేకపోతే భారత్​కు నష్టమేనని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా రియాక్ట్ అయ్యాడు.

కోహ్లీ లేకపోయినా టీమిండియాకు ఎలాంటి నష్టం లేదన్నాడు ఆకాశ్ చోప్రా. అతడు ఆడకపోతే జీవితం, క్రికెట్ ఏమీ ఆగిపోవంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ కోహ్లీ లేకపోయినా ఇంగ్లండ్​తో సిరీస్​ను భారత్ కోల్పోదని భావిస్తున్నా. నిజాయితీగా చెప్పాలంటే ఒకరు ఉన్నా, లేకపోయినా లైఫ్​ మాత్రం ఆగిపోదు. కోహ్లీ లేడని కాస్త బాధ ఉండొచ్చు. కానీ ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డపై ఓడించినప్పుడు కూడా టీమ్​లో అతడు లేడనే సంగతిని గుర్తు పెట్టుకోవాలి. అడిలైడ్ టెస్టులో విరాట్ ఉండి కూడా మనం ఓడిపోయాం. గబ్బా టెస్టులో ఎలా నెగ్గామో అందరికీ తెలుసు. ఉప్పల్, వైజాగ్ టెస్టుల్లో కోహ్లీ ఉండుంటే ఏదో ఒక మ్యాచ్​లో కచ్చితంగా 150 ప్లస్ స్కోరు చేసేవాడు. ఇంగ్లండ్ బౌలింగ్ వీక్​గా ఉంది. విరాట్​ను ఆపడం వాళ్లకు చాలా కష్టమయ్యేది’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్​తో కోహ్లీ చెడుగుడు ఆడుకునేవాడని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ‘ఇంగ్లీష్ టీమ్ బౌలింగ్ యూనిట్ చాలా బలహీనంగా ఉంది. మరీ ముఖ్యంగా రెహాన్ అహ్మద్ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. కోహ్లీ తన బౌలింగ్​లో ఆడి నాలుగు బౌండరీలు కొడితే బాగుండేదని ఓ సందర్భంలో రెహాన్ అన్నాడు. కానీ కోహ్లీ నాలుగు ఫోర్లు కొట్టి వికెట్ ఇచ్చే రకం కాదు. అతడు క్రీజులో సెటిలైతే బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. జాక్ లీచ్, హార్ట్​లీ, షోయబ్ బషీర్ ఉన్నా అతడు మాత్రం 50 నుంచి 70 పరుగులతో ఆపడు. మంచి స్టార్ట్స్ దొరికితే దాన్ని భారీ సెంచరీలుగా మలచడం కోహ్లీకి అలవాటు. అందుకే ఇతర బ్యాటర్లతో కంపేర్ చేసినప్పుడు విరాట్ భిన్నంగా కనిపిస్తాడు. అతడో అద్భుత బ్యాట్స్​మన్’ అని ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లులు కురిపించాడు. మరి.. కోహ్లీ ఆడకపోయినా భారత్​కు నష్టం లేదంటూ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: మూడో టెస్టుకు ముందు ఇంగ్లండ్​కు భారీ షాక్.. ఇక ఆశలు వదులుకోవాల్సిందే!

Show comments