Nidhan
ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడేందుకు భారత్‌కు వస్తున్న ఇంగ్లండ్ జట్టుకు ఓ టీమిండియా లెజెండ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. బజ్‌బాల్‌కు కౌంటర్‌గా తమ దగ్గర విరాట్‌బాల్ ఉందన్నాడు.
ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడేందుకు భారత్‌కు వస్తున్న ఇంగ్లండ్ జట్టుకు ఓ టీమిండియా లెజెండ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. బజ్‌బాల్‌కు కౌంటర్‌గా తమ దగ్గర విరాట్‌బాల్ ఉందన్నాడు.
Nidhan
క్రికెట్లో మరో ఆసక్తికర పోరుకు అంతా సిద్ధమవుతోంది. టాప్ టీమ్స్ అయిన భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదు మ్యాచులు జరగనున్నాయి. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌లో నెగ్గడం టీమిండియాకు ఎంతో కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్‌కు చేరుకోవాలంటే ఈ సిరీస్‌లో గెలవాల్సి ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ టీమ్‌ను చిత్తు చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. రికార్డుల పరంగా చూసుకుంటే ఇంగ్లండ్ ఎప్పుడు భారత్‌కు వచ్చినా ఖాళీ చేతులతోనే వెళ్లింది. కానీ ఒక్క 2012లో మాత్రం అలిస్టర్ కుక్ కెప్టెన్సీలో టెస్ట్ సిరీస్‌ను నెగ్గింది. ఆ తర్వాత మళ్లీ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈసారి భారత్‌ను ఓడించేందుకు బజ్‌బాల్ మంత్రాన్ని కూడా ప్రయోగించాలని చూస్తోంది. ఈ తరుణంలో బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా దగ్గర కూడా ఓ అస్త్రం ఉందన్నాడు.
బజ్‌బాల్‌కు కౌంటర్‌గా భారత్ దగ్గర విరాట్‌బాల్ ఉందన్నాడు గవాస్కర్. ఈ అస్త్రాన్ని తట్టుకోవడం ఇంగ్లండ్ వల్ల సాధ్యం కాదని హెచ్చరించాడు. టీమిండియా చేతిలో మరోసారి ఇంగ్లీష్ టీమ్‌కు ఓటమి తప్పదని చెప్పాడు. ‘ఇంగ్లండ్ బజ్‌బాల్ స్ట్రాటజీని చిత్తు చేసేందుకు భారత్ దగ్గర విరాట్‌బాల్ ఉంది. ఇంగ్లీష్ టీమ్ మీద కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు, కదలికలు చాలా బాగున్నాయి. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్‌కు అతడ్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు. బజ్‌బాల్‌కు సరైన కౌంటర్ విరాట్బాలే’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. గత రెండు, మూడేళ్లుగా ఇంగ్లండ్ జట్టు అగ్రెసివ్‌గా ఆడుతోందని తెలిపాడు. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా దూకుడుగా ఆడాలని వారు డిసైడ్ అయి దాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నాడు గవాస్కర్. అయితే ఈ ఫార్ములా భారత్‌లో ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలన్నాడు.
ఇండియాలోని టర్నింట్ ట్రాక్స్ మీద రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి టాప్ స్పిన్నర్ల బౌలింగ్‌లో బజ్ బాల్ వర్కౌట్ అవడం కష్టమేనన్నాడు గవాస్కర్. ఇంగ్లండ్ ఈ ఫార్ములాను ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలని ఉందన్నాడు. ఇక, ఇంగ్లీష్ టీమ్‌పై విరాట్ కోహ్లీ రికార్డులను చూసుకుంటే.. ఇప్పటిదాకా ఆ జట్టుతో 28 మ్యాచులు ఆడాడు. వాటిల్లో 42.36 యావరేజ్‌తో 1991 పరుగులు చేశాడు కింగ్. అందుకే ఇంగ్లండ్‌కు సరైనోడు కోహ్లీనేనని గవాస్కర్ సహా పలువురు భారత మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఈ విషయం ఇంగ్లీష్ టీమ్‌కు కూడా తెలుసు. అందుకే ఆ దేశ మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత ప్లేయర్లు కోహ్లీని టార్గెట్ చేసుకుంటున్నారు. కోహ్లీకి ఈగో ఎక్కువని.. అతడి ఈగోతో ఆడుకుంటామంటూ రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాట్‌తోనే వారికి సమాధానం ఇస్తాడేమో చూడాలి. మరి.. బజ్‌బాల్‌కు విరాట్‌బాల్ సరైన కౌంటర్ అంటూ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sunil Gavaskar reckons that Virat Kohli will be a potent threat to England’s Bazball approach 🙌#INDvsENG #ViratKohli #SunilGavaskar #TeamIndia #CricketTwitter pic.twitter.com/w8kU1P9rv9
— InsideSport (@InsideSportIND) January 21, 2024