Shreyas Iyer: ఇంగ్లండ్​తో సిరీస్​లో దక్కిన చోటు.. శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..!

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​ మరో ఛాలెంజ్​కు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో తన తడాఖా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సిరీస్​కు ముందు అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​ మరో ఛాలెంజ్​కు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో తన తడాఖా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సిరీస్​కు ముందు అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​ ముగింపునకు చేరుకుంది. ఇంకో మ్యాచ్ ఆడితే ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్​ను 2-0తో గెలుచుకున్న టీమిండియా.. ఆఖరి టీ20లోనూ నెగ్గి ప్రత్యర్థిని వైట్​వాష్ చేయాలని చూస్తోంది. ఈ సిరీస్ అయిపోయిన వెంటనే ఇంగ్లండ్​తో 5 టెస్టుల సిరీస్​లో పాల్గొంటుంది రోహిత్ సేన. దీనికి సంబంధించి ఇప్పటికే 16 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ప్రకటించారు. మొదటి రెండు టెస్టులకు మాత్రమే స్క్వాడ్​ను అనౌన్స్ చేశారు. తర్వాతి రెండు మ్యాచుల్లో ఆడే జట్టును ఇంకా ప్రకటించలేదు. ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టుల్లో బరిలోకి దిగే టీమ్​లో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఊరికే వచ్చిందేదీ తనకు అక్కర్లేదన్నాడు. తనకు సవాళ్లు అంటే ఎంతో ఇష్టమన్నాడు. ఛాలెంజ్ ఉన్నప్పుడే బెస్ట్ ఇవ్వగలమన్నాడు అయ్యర్.

రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ఆంధ్రాతో జరిగిన మ్యాచ్​లో ముంబై తరఫున బరిలోకి దిగాడు అయ్యర్. ఈ మ్యాచ్​లో ముంబై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అనంతరం ఈ టీమిండియా స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను వర్తమానంలో ఉండేందుకే ఇష్టపడతానన్నాడు. ఆంధ్రాతో మ్యాచ్​లో ఆడాలని తనకు చెప్పారని.. తన పని పూర్తయిందన్నాడు. ఈ మ్యాచ్​లో తాను ఆడిన తీరుతో సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు అయ్యర్. తన చేతిలో లేని విషయాల గురించి అస్సలు ఆలోచించనని స్పష్టం చేశాడు. వచ్చి మ్యాచ్​ ఆడి టీమ్​ను గెలిపించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​ పైనా రియాక్ట్ అయ్యాడు అయ్యర్. ఆ సిరీస్​లోని ప్రతి మ్యాచ్​ను విడిగా చూడాలని తెలిపాడు. మొదటి రెండు మ్యాచులకే స్క్వాడ్​ను ప్రకటించారని పేర్కొన్నాడు.

ఇంగ్లండ్​తో తొలి రెండు మ్యాచులకు మాత్రమే జట్టును ప్రకటించారు. మొత్తం సిరీస్ గురించి ఆలోచించి టెన్షన్ పడకుండా ప్రతి మ్యాచ్​ను విడివిడిగా చూడాలి. మొదటి రెండు టెస్టుల్లో సత్తా చాటడమే ఇప్పుడు నా కర్తవ్యం. అదే పెర్ఫార్మెన్స్​ను మిగిలిన సిరీస్ మొత్తం కంటిన్యూ చేయాలి. ఇంగ్లండ్​తో సిరీస్​లో టర్నింగ్ వికెట్లలో ఆడాల్సి ఉంటుందని అనుకుంటున్నా. అయితే నేను మాత్రం నా ఫిట్​నెస్​, క్రీజులో పాతుకుపోవడం, సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం మీదే ఫోకస్ చేస్తున్నా. గాయం తర్వాత ఔట్​ఫీల్డ్​లో ఎక్కువ సేపు ఉండటం టఫ్​గా మారింది. కాబట్టి దీన్ని మంచి ప్రాక్టీస్​గా భావిస్తున్నా. ఈ సిరీస్​ను ఉపయోగించుకుంటా. నాకు కాంపిటీషన్ అంటే చాలా ఇష్టం. ఛాలెంజ్ ఎదురైనప్పుడే మన బెస్ట్ ఇవ్వగలం. ఆ టైమ్​లోనే మన టాలెంట్, స్కిల్స్ బయటపడతాయి’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. మరి.. ఇంగ్లండ్​తో సిరీస్​కు ముందు అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్‌! రోహిత్‌ వైఫల్యానికి కారణం అదేనా?

Show comments