వీడియో: బషీర్​ను స్లెడ్జ్ చేసిన సర్ఫరాజ్.. అది కూడా రాదంటూ..!

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్​తోనే కాదు నోటితోనూ ఇంగ్లండ్ పని పట్టాడు. ప్రత్యర్థి ఆటగాడిపై సర్ఫరాజ్ స్లెడ్జింగ్​కు దిగాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్​తోనే కాదు నోటితోనూ ఇంగ్లండ్ పని పట్టాడు. ప్రత్యర్థి ఆటగాడిపై సర్ఫరాజ్ స్లెడ్జింగ్​కు దిగాడు.

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ అదరగొడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​కు దీటుగా టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. రెండో రోజు ఇన్నింగ్స్​ను కొనసాగించిన ఇంగ్లీష్ టీమ్​ను ఆలౌట్ చేసేందుకు రోహిత్ సేనకు ఎక్కువ టైమ్ పట్టలేదు. జో రూట్ (122 నాటౌట్) ఒకవైపు క్రీజులో పాతుకుపోయినా మరోవైపు అతడికి సహకరించేవారు కరువయ్యారు. ఓలీ రాబిన్సన్ (58)తో పాటు షోయబ్ బషీర్ (0), జేమ్స్ అండర్సన్ (0) 6 పరుగుల వ్యవధిలో ఔట్ అయ్యారు. రూట్ ఒక ఎండ్​లో చూస్తుండగానే మిగిలిన ఎండ్​లో వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు ఔటై పెవిలియన్​కు చేరాడు. అయితే 353 పరుగుల భారీ స్కోరు సాధించడంతో ఆ టీమ్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్​లో భారత యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్ హైలైట్​గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఓలీ రాబిన్సన్ ఔట్ కావడంతో ఇన్నింగ్స్​ 102వ ఓవర్​లో క్రీజులోకి వచ్చాడు షోయబ్ బషీర్. అయితే పాక్​ మూలాలు ఉన్న బషీర్​ను ఓ ఆటాడుకున్నాడు సర్ఫరాజ్. సిల్లీ మిడాఫ్​లో ఫీల్డింగ్ చేస్తూ అతడ్ని రెచ్చగొట్టాడు. బషీర్​కు బ్యాటింగ్ చేయడం తెలుసు గానీ.. హిందీ మాట్లాడటం మాత్రం అస్సలు రాదన్నాడు. అతడికి హిందీ అర్థం కూడా కాదన్నాడు సర్ఫరాజ్. దీంతో క్రీజులో ఉన్న బషీర్ రియాక్ట్ కాక తప్పలేదు. తనకు హిందీ కొంచెం వచ్చని రిప్లయ్ ఇచ్చాడు. అయినా అతడ్ని వదలకుండా కాన్​సంట్రేషన్ దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు సర్ఫరాజ్. ఇది వర్కౌట్ అయింది. రెండు బంతులు ఆడిన బషీర్.. రవీంద్ర జడేజా బౌలింగ్​లో రజత్ పాటిదార్​కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. బషీర్​ను సర్ఫరాజ్​ స్లెడ్జ్ చేసిన టైమ్​లో చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్​లో రికార్డు అయ్యాయి.

సర్ఫరాజ్-బషీర్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ సర్ఫరాజ్ అస్సలు తగ్గట్లేదని అంటున్నారు. బ్యాట్​తోనే కాదు.. నోటితోనూ ఇంగ్లండ్​ ప్లేయర్లతో ఆడుకుంటున్నాని చెబుతున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉంటే ఇంగ్లీష్ టీమ్​ను మరింత ఇబ్బంది పెట్టేవాడని.. అతడు లేనందున సర్ఫరాజ్ స్లెడ్జ్ చేస్తున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత్ ప్రస్తుతం 19 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 63 పరుగులతో ఉంది. యశస్వి జైస్వాల్ (40 నాటౌట్), శుబ్​మన్ గిల్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (2)ను అండర్సన్ వెనక్కి పంపాడు. ప్రత్యర్థి స్కోరుకు టీమిండియా ఇంకా 290 పరుగుల దూరంలో ఉంది. మరి.. సర్ఫరాజ్ స్లెడ్జింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాండ్యాను ఫ్యాన్స్ తిట్టాలి.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

Show comments