Nidhan
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు కంపారిజన్ లేదన్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. ఆ విషయంలో విరాట్‌కు హిట్‌మ్యాన్ సాటిరాడని చెప్పాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు కంపారిజన్ లేదన్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. ఆ విషయంలో విరాట్‌కు హిట్‌మ్యాన్ సాటిరాడని చెప్పాడు.
Nidhan
ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో జరిగిన పరాభవం నుంచి టీమిండియా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉండటం, స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతుండటంతో భారత్ ఈజీగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే తొలి రెండ్రోజులు రోహిత్ సేనదే డామినేషన్ నడిచింది. అయితే ఎన్ని సవాళ్లు ఎదురైనా తట్టుకొని బజ్‌బాల్ క్రికెట్‌ను ఫాలో అయిన ఇంగ్లీష్ టీమ్‌నే ఆఖరికి విజయం వరించింది. దీంతో భారత జట్టుపై ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారీగా విమర్శలు వస్తున్నాయి. హిట్‌మ్యాన్ బ్యాటర్‌గానూ, సారథిగానూ దారుణంగా ఫెయిలయ్యాడని.. భారత్ ఓటమికి అదే ప్రధాన కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తిరిగి టెస్టు పగ్గాలు అప్పజెప్పాలనే డిమాండ్లు కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి వస్తోంది. ఈ తరుణంలో రోహిత్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్. విరాట్‌కు హిట్‌మ్యాన్ సాటిరాడని అన్నాడు.
మొదటి టెస్టులో విరాట్ కోహ్లీని టీమిండియా చాలా మిస్సయిందన్నాడు వాన్. అతడు జట్టులో ఉండి ఉంటే సిచ్యువేషన్ మరోలా ఉండేదన్నాడు. కెప్టెన్సీ విషయంలో కోహ్లీ ముందు రోహిత్ పనికి రాడన్నాడు. ‘టెస్టు క్రికెట్లో కోహ్లీ కెప్టెన్సీని భారత్ చాలా మిస్సవుతోంది. విరాట్ సారథిగా ఉన్నప్పుడు ఒక్క సిరీస్‌లో కూడా టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు. అతడో లెజెండ్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే కెప్టెన్‌గా మాత్రం కాదు’ అని వాన్ చెప్పుకొచ్చాడు. సారథిగా తన మీద అందరూ పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను హిట్‌మ్యాన్ రీచ్ అవడం లేదన్నాడు. గ్రౌండ్లో కీలక సమయాల్లో అతడు పూర్తిగా స్విచాఫ్ అయిపోతున్నాడని వాన్ విమర్శించాడు. ఉప్పల్‌లో జరిగిన మొదటి టెస్టులో అతడి కెప్టెన్సీ చాలా యావరేజీగా ఉందన్నాడు. ఓలీ పాప్ చెలరేగి ఆడుతున్న టైమ్‌లో అతడ్ని ఆపడంలో రోహిత్ విఫలమయ్యాడని తెలిపాడు.
ఇక, విశాఖపట్నంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సెకండ్ టెస్ట్ షురూ కానుంది. ఈ మ్యాచ్‌కు కోహ్లీతో పాటు మరో ఇద్దరు స్టార్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యారు. గాయంతో బాధపడుతున్న వీళ్లిద్దరూ ఇప్పడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నారు. అయితే జడ్డూకు అయిన గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. సిరీస్‌లోని మిగతా మ్యాచులకూ అతడు దూరమయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. రాహుల్ ఇంజ్యురీ చిన్నదేనని.. మూడో టెస్టుకల్లా అతడు కోలుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక, మొదటి టెస్టుకు దూరంగా ఉన్న విరాట్.. రెండో మ్యాచ్‌కూ అందుబాటులో ఉండట్లేదు. అతడి రాక కోసం టీమ్ మేనేజ్మెంట్తో పాటు కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అతడు సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని వినికిడి. కోహ్లీ తల్లి సరోజ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అందుకే అతడు పూర్తి సిరీస్‌కు దూరమవుతాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్ని విరాట్ సోదరుడు ఖండించాడు. తన తల్లి ఎంతో ఆరోగ్యంగా ఉందని కోహ్లీ బ్రదర్ వికాస్ కోహ్లీ ఓ పోస్ట్ పెట్టాడు. మరి.. కెప్టెన్సీ విషయంలో కోహ్లీ ముందు రోహిత్ పనికిరాడంటూ వాన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Michael Vaughan said, “India miss Virat Kohli’s captaincy massively in Test cricket. Under Virat’s captaincy, India wouldn’t have lost 1st Test. Rohit is a legend and a great player, but I felt he just switched off completely”. (Club Prairie Fire show). pic.twitter.com/AzUKRFhnGH
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2024