IND vs ENG: వీడియో: జడేజాను తక్కువగా అంచనా వేసి దారుణంగా దెబ్బతిన్న బెయిర్‌స్టో!

ఉప్పల్ టెస్ట్​లో ఇంగ్లండ్​కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు భారత బౌలర్లు. మన బౌలర్లను తక్కువ అంచనా వేసి బజ్​బాల్​తో కొట్టేదామనుకున్న ప్రత్యర్థి జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

ఉప్పల్ టెస్ట్​లో ఇంగ్లండ్​కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు భారత బౌలర్లు. మన బౌలర్లను తక్కువ అంచనా వేసి బజ్​బాల్​తో కొట్టేదామనుకున్న ప్రత్యర్థి జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

బజ్​బాల్ బెండు తీస్తోంది భారత్. అసలైన టెస్ట్ క్రికెట్ మజా ఏంటో చూపిస్తూ తొలి టెస్టులో అదరగొడుతోంది రోహిత్ సేన. బజ్​బాల్​ ఫార్ములాతో అటాకింగ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్న ఇంగ్లీష్ టీమ్​కు చుక్కలు చూపిస్తోంది. ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో పర్యాటక జట్టు 246 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా 436 పరుగులు చేసింది. 190 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్టోక్స్ సేనకు ఒక దాని వెంట ఒకటి దిమ్మతిరిగే షాకులు తగులుతున్నాయి. మూడో రోజు లంచ్ వరకు బాగానే బ్యాటింగ్ చేసినా ఆ తర్వాత నుంచి బాల్ రివర్స్ స్వింగ్ అవడం, బౌన్స్ కావడం, స్పిన్​కు సహకరించడంతో భారత బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనను తక్కువగా అంచనా వేసిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్​స్టోకు షాక్ ఇచ్చాడు జడేజా.

జడేజా దెబ్బకు బెయిర్​స్టో నోరెళ్లబెట్టాడు. రెండో ఇన్నింగ్స్​లో 117 పరుగులకు మూడు వికెట్లు పడిన దశలో బ్యాటింగ్​కు వచ్చాడు బెయిర్​స్టో (10). ఓలీ పాప్ (66)తో కలసి 23 పరుగులు జోడించాడు. అయితే ఈ జోడీని జడ్డూ విడదీశాడు. సూపర్బ్ బౌలింగ్​తో బెయిర్​స్టోకు పెవిలియన్​ దారి చూపించాడు. ఆ ఓవర్​లో మంచి సెటప్ చేసి ఔట్ చేశాడు. అప్పటికే కొన్ని డెలివరీస్ స్పిన్‌ చేయడంతో నెక్స్ట్ బాల్ కూడా అలాగే తిరుగుతుందని భావించిన బెయిర్​స్టో దాన్ని వదిలేశాడు. కానీ అనూహ్యంగా బాల్ టర్న్ అవ్వలేదు. లెంగ్త్​లో పడిన బాల్ దూసుకొచ్చి నేరుగా స్టంప్స్​ను ముద్దాడింది. బాల్ టర్న్ అవుతుందనుకొని వదిలేస్తే అది కాస్తా పడ్డాక స్ట్రయిట్​గా వచ్చి క్లీన్ బౌల్డ్ కావడంతో బెయిర్​స్టో బిత్తరపోయాడు. ఇదేం బౌలింగ్​ రా బాబు అనుకున్నాడు. కాసేపు అక్కడే ఉండి ఎలా ఔట్ అయ్యానా అని ఆలోచిస్తూ తెల్లమొహం వేశాడు. అయితే ఈజీగా వికెట్ ఇచ్చినందుకు బెయిర్​స్టోకు జడ్డూ థ్యాంక్స్ చెప్పాడు.

బెయిర్​స్టో ఔట్ అయ్యాక ఇన్నింగ్స్​ను చక్కదిద్దేందుకు వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా పెవిలియన్​కు చేరుకున్నాడు. ఓ ఫెంటాస్టిక్ డెలివరీతో అతడ్ని ఔట్ చేశాడు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. అతడు వేసిన బాల్ ఆఫ్​ స్పిన్ కావడంతో స్టోక్స్ బౌల్డ్ అయ్యాడు. లేట్​గా ఆడటంతోనే అతడు ఔట్ అయ్యాడు. మూడో రోజు టీ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 172 పరుగులతో ఉంది. బెన్​ ఫోక్స్ (2 నాటౌట్), ఓలీ పాప్ (67 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాల్లేవు. ఇంకా రెండ్రోజులు మిగిలి ఉంది. కాబట్టి ఇంగ్లండ్ ఓడటం ఖాయం. అయితే మ్యాచ్ ఎప్పుడు ముగుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సిచ్యువేషన్​ను బట్టి ఇంగ్లీష్ టీమ్ ఈ రోజే ఆలౌట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి.. ఉప్పల్ టెస్ట్​లో భారత్ ఆడుతున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments