Nidhan
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అన్యాయం జరిగింది. అతడు నాటౌట్ అయినా.. ఔట్‌గా ప్రకటించారు. జడ్డూ విషయంలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అన్యాయం జరిగింది. అతడు నాటౌట్ అయినా.. ఔట్‌గా ప్రకటించారు. జడ్డూ విషయంలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
క్రికెట్లో కొన్ని రూల్స్ అటు ఆటగాళ్లతో పాటు ఇటు మ్యాచులు చూసే ఆడియెన్స్‌కు కూడా చిరాకు పుట్టిస్తాయి. వాటి వల్ల ప్లేయర్లు తీవ్రంగా నిరుత్సాహానికి గురవుతారు. ఇదేం రూల్ రా బాబు అని ప్రేక్షకులు కూడా అసంతృప్తికి లోనవుతారు. అలాంటి ఓ నిబంధన వల్ల టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అన్యాయం జరిగింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అతడ్ని ఆ రూల్ ఆపేసింది. మూడంకెల మార్క్‌ను చేరుకొని భారత్‌కు మరింత లీడ్ అందిద్దామని అనుకున్న జడ్డూను క్రీజు వీడేలా చేసిందా రూల్. అదే బెనిఫిట్ ఆఫ్ డౌట్. క్రికెట్లో బాగా చర్చనీయాంశమైన నిబంధనల్లో ఇదొకటి. దీని వల్ల కొన్నిసార్లు బౌలర్లు, ఫీల్డర్లు ఇబ్బందిపెడితే.. మరికొన్ని సందర్భాల్లో బ్యాటర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. క్యాచులు, ఎల్బీడబ్ల్యూల కోసం ఈ రూల్‌ను ఎక్కువగా వాడతారు. కన్‌క్లూజివ్ ఎవిడెన్స్ దొరకని టైమ్‌లో బెనిఫిట్ ఆఫ్ డౌట్‌ను యూజ్ చేస్తారు. అలాంటి ఈ రూల్ వల్ల జడేజాకు అన్యాయం జరిగింది.
బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్ అయినా జడేజాను ఔట్‌గా ప్రకటించారు అంపైర్లు. దీంతో 87 పరుగులు చేసిన అతడు బాధతో క్రీజును వీడాడు. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ వేసిన బాల్‌కు జడ్డూ బ్యాట్‌ను అడ్డంగా పెట్టాడు. కానీ బాల్ ప్యాడ్స్‌కు తగలడం, వికెట్ల ముందు దొరికిపోయినట్లు కనిపించడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. కానీ బాల్ బ్యాట్‌కు తగలడంతో కాన్ఫిడెంట్‌గా ఉన్న జడ్డూ రివ్యూకు వెళ్లాడు. అయితే అల్ట్రాఎడ్జ్‌లో బాల్ ఒకేసారి బ్యాట్‌తో పాటు ప్యాడ్స్‌కు తాకినట్లు తేలింది. బాల్ ముందుగా బ్యాట్‌ను తాకిందా? లేదా ప్యాడ్స్‌ను తాకిందా అనే దాని మీద థర్డ్ అంపైర్ ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో అదే నిర్ణయానికి కట్టుబడి జడ్డూను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో షాకైన స్టార్ ఆల్‌రౌండర్ నిరాశతో క్రీజును వీడాడు. బాగా ఆడుతున్న తరుణంలో చెత్త రూల్ వల్ల ఔట్ కావడం, సెంచరీ మిస్సవడంతో బాధతో కనిపించాడు. ఆ విధంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద జడ్డూకు అన్యాయం జరిగింది.
జడ్డూకు జరిగిన అన్యాయం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. చెత్త రూల్ వల్ల అతడు సెంచరీ మిస్సయ్యాడని అంటున్నారు. ఇలాంటి నిబంధనలు అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి రివ్యూకు వెళ్తే అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఎల్బీడబ్ల్యూలు, క్యాచులు లాంటి వాటిల్లో పూర్తి నిర్ణయం థర్డ్ అంపైర్‌కే వదిలేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 436 పరుగులు చేసింది. కీలకమైన 190 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ టీమ్ ప్రస్తుతం వికెట్ నష్టానికి 89 పరుగులతో ఉంది. భారత్ స్కోరుకు ఆ జట్టు ఇంకా 101 పరుగుల దూరంలో ఉంది. వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తే మన బౌలర్లు చెలరేగుతారు. కాబట్టి మ్యాచ్ ఇవాళే ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి.. జడేజాకు అన్యాయం జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Unlucky Ravindra Jadeja.
– The benefit of the doubt didn’t go his way! pic.twitter.com/zEyHcEOOGc
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 27, 2024