టాస్ ఓడిన భారత్.. తొలుత ఫీల్డింగ్.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!

ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఆఖరి టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఆఖరి టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

భారత్-ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా ఐదో టెస్టు స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ప్రత్యర్థి జట్టు సారథి బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్​ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉండటం, టైమ్ గడిచే కొద్దీ పేస్ బౌలింగ్​కు సహకారం లభించే ఛాన్స్ ఉండటంతో ముందు స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో భారత్ ఫీల్డింగ్​కు దిగుతోంది. ఈ మ్యాచ్​లో మన ప్లేయింగ్ ఎలెవన్​లో కేవలం ఒకే ఒక మార్పు చేశారు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్​లో శుబ్​మన్ గిల్ ఆడతాడు.

గత మూడు టెస్టుల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయినా రజత్ పాటిదార్ ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. అతడ్ని ఆడించాలని టీమ్ మేనేజ్​మెంట్ అనుకుంది. కానీ ప్రాక్టీస్​ చేస్తుండగా గాయమవడంతో అతడి ప్లేసులో దేవ్​దత్ పడిక్కల్​ను టీమ్​లోకి తీసుకున్నారు. ఇది అతడికి అరంగేట్ర మ్యాచ్ కావడం విశేషం. ఇక, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా మిడిలార్డర్ భారం మోయనున్నారు. స్పిన్ బాధ్యతల్ని జడ్డూతో కలసి రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ పంచుకుంటారు. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అతడ్ని ఈ మ్యాచ్​లోనూ ఆడిస్తున్నారు. మహ్మద్ సిరాజ్​తో కలసి బుమ్రా మన పేస్ అటాక్​ను ముందుండి నడిపించనున్నాడు. మరి.. ఐదో టెస్టులో భారత ప్లేయింగ్ ఎలెవన్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

భారత జట్టు (ప్లేయింగ్ ఎలెవన్):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్, దేవ్​దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Show comments