IND vs ENG Main Challenge For Rohit Sharma: టీమిండియాకు సెమీస్​ గండం.. ఫైనల్ వెళ్లాలంటే ఆ ముగ్గుర్ని ఆపాలి!

టీమిండియాకు సెమీస్​ గండం.. ఫైనల్ వెళ్లాలంటే ఆ ముగ్గుర్ని ఆపాలి!

టీ20 వరల్డ్ కప్​లో వరుస విజయాలతో హోరెత్తిస్తూ సెమీస్​కు దూసుకొచ్చింది భారత్. అయితే మెగాటోర్నీ ఫైనల్​కు చేరాలంటే నాకౌట్ గండాన్ని దాటాలి. అందుకు ఆ ముగ్గుర్ని ఆపితే సరిపోతుంది.

టీ20 వరల్డ్ కప్​లో వరుస విజయాలతో హోరెత్తిస్తూ సెమీస్​కు దూసుకొచ్చింది భారత్. అయితే మెగాటోర్నీ ఫైనల్​కు చేరాలంటే నాకౌట్ గండాన్ని దాటాలి. అందుకు ఆ ముగ్గుర్ని ఆపితే సరిపోతుంది.

టీ20 వరల్డ్ కప్​లో వరుస విజయాలతో హోరెత్తిస్తూ సెమీస్​కు దూసుకొచ్చింది భారత్. అయితే మెగాటోర్నీ ఫైనల్​కు చేరాలంటే నాకౌట్ గండాన్ని దాటాలి. అందుకు ఆ ముగ్గుర్ని ఆపితే సరిపోతుంది. లీగ్ స్టేజ్​లో ఐర్లాండ్, పాకిస్థాన్, యూఎస్​ఏను చిత్తు చేసిన రోహిత్ సేన.. సూపర్-8లో ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్​ను మట్టికరిపించింది. ఆఖరి సూపర్ పోరులో ఫేవరెట్ ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడుకొని ఇంటికి పంపించింది. ఇప్పుడు సెమీస్ ఫైట్​కు సిద్ధమవుతోంది మెన్ ఇన్ బ్లూ. పటిష్టమైన ఇంగ్లండ్​ జట్టుతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. ఫైనల్​కు చేరాలంటే ఇంగ్లీష్ టీమ్​ను ఓడించక తప్పదు. ఆల్రెడీ ఆ టీమ్ మీద భారత్ పగతో రగిలిపోతోంది. గత పొట్టి కప్పులో నాకౌట్ ఫైట్​లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది.

వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్ ఓటమికి ప్రస్తుత పొట్టి కప్పు సూపర్-8 మ్యాచ్​లో రివేంజ్ తీర్చుకుంది టీమిండియా. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి సంతోషంలో మునిగిపోయింది. ఇప్పుడు ఇంకో రివేంజ్ ఫైట్​కు రెడీ అవుతోంది. గత టీ20 వరల్డ్ కప్​లో ఎదురైన ఓటమికి ఇంగ్లండ్​ను చిత్తు చిత్తుగా ఓడించాలని చూస్తోంది. అయితే ఆ జట్టు మీద గెలవడం అంత ఈజీ కాదు. బిగ్ మ్యాచెస్​లో ఎలా ఆడాలో బట్లర్ సేనకు బాగా తెలుసు. దూకుడు మంత్రంతో ప్రత్యర్థులు కోలుకునేలోగా మ్యాచ్​ను ముగించడం వాళ్లకు అలవాటుగా మారింది. ప్రెజర్ తీసుకోకుండా ఆడటం, అవతలి జట్టును ఒత్తిడిలోకి నెట్టడం ఆ టీమ్ స్టైల్. ఆ టీమ్​లోని ముగ్గురు ఆటగాళ్ల నుంచి భారత్​కు ప్రమాదం పొంచి ఉంది. వీళ్లను ఆపితే గానీ ఫైనల్​కు చేరలేం.

నాకౌట్ ఫైట్​కు ముందు ముగ్గురు ఇంగ్లండ్ ప్లేయర్లు భారత్​ను భయపెడుతున్నారు. అందులో ఒకడు కెప్టెన్ జాస్ బట్లర్. తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్​ను వన్​సైడ్ చేయగల సత్తా అతడి సొంతం. ప్రస్తుత వరల్డ్ కప్​లో అతడు మంచి టచ్​లో ఉన్నాడు. 191 పరుగులతో ఫామ్​ను చాటుకున్నాడు. లాస్ట్ మ్యాచ్​లో యూఎస్​ఏ మీద 38 బంతుల్లోనే 83 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో సెటిలైతే మ్యాచ్​ను ఫినిష్ చేయకుండా వెళ్లడు బట్లర్. అలాంటోడ్ని గనుక ఆపకపోతే భారత్​కు కష్టమే. మన టీమ్​ను భయపెడుతున్న మరో ఆటగాడు ఫిల్ సాల్ట్. మెగాటోర్నీలో 183 పరుగులు చేసిన ఈ ఇంగ్లీష్ ఓపెనర్.. తమ టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు సాల్ట్. అతడ్ని మొదట్లోనే ఔట్ చేస్తే.. ఇంగ్లండ్ భారీ స్కోరు చేయకుండా ఆపొచ్చు. ఇక, రోహిత్ సేనకు ఫైనల్​కు మధ్య అడ్డుగా ఉన్న మూడో ఆటగాడు పేసర్ జోఫ్రా ఆర్చర్. గాయం తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన ఈ స్పీడ్​స్టర్.. సూపర్బ్​గా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ టోర్నీలో 7 వికెట్లు తీసిన ఆర్చర్ ఎకానమీ 7.02గా ఉంది. పదునైన యార్కర్లు, బౌన్సర్లు, స్వింగింగ్ డెలివరీస్​తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ఆర్చర్​ను ఎలా ఎదుర్కొంటారనే దాని మీదే మన టీమ్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. మరి.. ఈ ముగ్గురి అడ్డును భారత్ దాటగలదని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments