Nidhan
టీమిండియాతో నాకౌట్ ఫైట్‌కు సిద్ధమవుతోంది ఇంగ్లండ్. అయితే అప్పుడే ఆ జట్టు మైండ్‌గేమ్ మొదలుపెట్టేసింది. తమకంతా తెలుసంటూ ఆ టీమ్ కెప్టెన్ జాస్ బట్లర్ భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
టీమిండియాతో నాకౌట్ ఫైట్‌కు సిద్ధమవుతోంది ఇంగ్లండ్. అయితే అప్పుడే ఆ జట్టు మైండ్‌గేమ్ మొదలుపెట్టేసింది. తమకంతా తెలుసంటూ ఆ టీమ్ కెప్టెన్ జాస్ బట్లర్ భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024 ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. సూపర్-8 దశ ముగిసింది. దీంతో అందరూ సెమీస్‌పై ఫోకస్ చేస్తున్నారు. రెండు గ్రూప్స్ నుంచి టీమిండియా, ఆఫ్ఘానిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ నాకౌట్‌కు చేరాయి. గురువారం జరగనున్న సెకండ్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది భారత్. నాకౌట్ ఫైట్ కాబట్టి ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రివేంజ్ ఫైట్ కూడా కావడంతో క్రికెట్ లవర్స్ ఈ గేమ్ కోసం మరింత ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్-2022 సెమీస్‌లో మన జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించింది ఇంగ్లీష్ టీమ్. మామూలు ఓటమైతే ఏమో అనుకోవచ్చు.. కానీ స్టార్లతో నిండిన జట్టు ఇంత దారుణంగా మట్టికరుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంగ్లండ్ కొట్టిన దెబ్బతో కప్పుకు రెండు అడుగుల దూరంలో ఆగిపోయింది భారత్.
గత వరల్డ్ కప్ పరాభవానికి ఇప్పుడు టీమిండియాకు రివేంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది. నాకౌట్ ఫైట్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాలని భారత్ భావిస్తోంది. తమను ఓడించిన దాని కంటే రెట్టింపుగా ఆ జట్టును చిత్తు చేయాలని అనుకుంటోంది. ఇందుకోసం అవసరమైన వ్యూహాలను పన్నడంలో బిజీ అయిపోయింది. మరోవైపు ఇంగ్లీష్ టీమ్ అప్పుడే మైండ్‌గేమ్ మొదలుపెట్టింది. తమకంతా తెలుసుంటూ భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. టీమిండియాను ఇబ్బంది పెట్టే బాధ్యతను ఆ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ తీసుకున్నాడు. సెమీస్‌లో రోహిత్ సేన ఎలా ఆడుతుందో తనకు తెలుసన్నాడు. ఆ జట్టులాగే తాము కూడా దూకుడుగా ఆడతామని అన్నాడు. నాకౌట్ ఫైట్‌లో తమదే గెలుపంటూ ఓవరాక్షన్ చేశాడు.
నాకౌట్ ఫైట్‌లో తమదే అప్పర్ హ్యాండ్ అవుతుందని బట్లర్ తెలిపాడు. టీమిండియాతో మ్యాచ్‌లో తమ జట్టే ఫేవరెట్ అని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్-2022 జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయని అన్నాడు. ఇంగ్లండ్ తరఫున తాను ఆడిన మ్యాచుల్లో అదో గొప్ప మ్యాచ్ అని బట్లర్ వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో తమకు మంచి స్టార్ట్ దొరికిందన్నాడు. హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఔట్ అవడం స్పెషల్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ వైఖరి మారిందని.. అప్పటి నుంచి దూకుడుగా ఆడటం మొదలుపెట్టారని అన్నాడు. ఈసారి రోహిత్ శర్మ నాయకత్వంలో భిన్నమైన జట్టుతో తాము తలపడబోతున్నామని బట్లర్ వివరించాడు. ఈ పోరులో టీమిండియా అగ్రెసివ్‌గా ఆడేందుకు ప్రయత్నిస్తుందని, తాము కూడా అదే అప్రోచ్‌తో ముందుకెళ్తామని స్పష్టం చేశాడు. మరి.. సెమీస్‌లో తమదే గెలుపంటూ బట్లర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Jos Buttler anticipates a fierce semi-final clash 🤜🤛 pic.twitter.com/ZmOgM71ezi
— CricTracker (@Cricketracker) June 26, 2024