Nidhan
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్ల వల్లే మ్యాచ్ చేజారిందన్నాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్ల వల్లే మ్యాచ్ చేజారిందన్నాడు.
Nidhan
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కించుకున్నా టీమిండియాకు ఓటమి మాత్రం తప్పలేదు. మొదటి రెండున్నర రోజులు ఆటపై భారత్‌దే పెత్తనం. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్‌ను ఆపడంలో బౌలర్లు ఫెయిలవడం, ఛేజింగ్‌లో బ్యాటర్లు చేతులెత్తేయడంతో రోహిత్ సేన ఓడిపోయింది. ప్రత్యర్థి నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో 202 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లలో బుమ్రా ఒక్కడే రాణించాడు. బ్యాటింగ్‌లో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకోలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మంచి స్టార్ట్స్ దొరికినా దాన్ని భారీ స్కోర్లుగా మలచేకపోయారు. అలాగే ఒకే లైన్ పట్టుకొని బౌలింగ్ చేస్తున్న ఇంగ్లండ్ స్పిన్నర్లపై ఒక్కరు కూడా అటాక్ చేయలేదు. దీంతో వాళ్లు మరింత చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ ఓటమిపై భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్లే మొదటి టెస్టులో ఓడిపోయామని ద్రవిడ్ అన్నాడు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా సెంచరీ చేయలేదన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ 80ల్లో ఔటయ్యారని తెలిపాడు. వాళ్లు సెంచరీలు చేసే అవకాశం చేజార్చుకున్నారని చెప్పాడు. ‘తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేసే ఛాన్స్ మిస్సయ్యారు. మరో 70 పరుగులు చేసి ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్‌గా ఉండేది. మొదటి రెండ్రోజులు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అప్పుడే ఇంకాస్త బాగా ఆడాల్సింది. కొన్ని మంచి స్టార్ట్స్ దొరికినా దాన్ని వాడుకోలేకపోయాం. టెస్టుల్లో ఫోర్త్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ సవాలే. 230 టార్గెట్ చిన్నగా కనిపించినా దాన్ని అందుకోవడం చాలా కష్టం. ఒక్క బ్యాట్స్‌మన్ అయినా సెంచరీ చేసి ఉంటే ఇంగ్లండ్ మీద డామినేషన్ చూపించేందుకు అవకాశం దక్కేది’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
టీమిండియాలో చాలా మంది యంగ్‌స్టర్స్ ఉన్నారని ద్రవిడ్ పేర్కొన్నాడు. వాళ్లకు డొమెస్టిక్ క్రికెట్లో మ్యాచులు ఆడిన ఎక్స్‌పీరియెన్స్ ఉందని.. ఇంటర్నేషనల్ లెవల్లో నేర్చుకోవడానికి వారికి ఇంకాస్త టైమ్ పడుతుందన్నాడు. వాళ్లు ఇలాంటి ఛాలెంజెస్ను ఎదుర్కోలేదని.. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందన్నాడు. దీని నుంచి నేర్చుకొని రాబోయే సిరీస్‌ల్లో బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తారని ఆశిస్తున్నానని ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓలీ పోప్ (196) అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. క్వాలిటీ బౌలింగ్‌లో ఇలాంటి పిచ్‌పై స్వీప్, రివర్స్ స్వీప్‌తో పరుగులు రాబట్టడం అంత ఈజీ కాదన్నాడు. అతడి విషయంలో భారత బౌలర్లు అనుకున్న ప్రణాళికల్ని సరిగ్గా అమలు చేయలేకపోయారని ద్రవిడ్ వివరించాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ ఫార్ములాను బ్రేక్ చేసేందుకు నెక్స్ట్ మ్యాచ్‌లో సరికొత్త వ్యూహాలతో వస్తామని స్పష్టం చేశాడు. మరి.. తొలి టెస్ట్‌లో ఓటమికి బ్యాటర్ల ఫెయిల్యూర్ కారణమంటూ భారత కోచ్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rahul Dravid said, “we didn’t get a hundred. We didn’t get somebody getting a really big century for us. I thought we left 70-80 runs in the 1st innings, when conditions were good to bat on Day 2”. pic.twitter.com/tIJvjAUwNa
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 28, 2024