iDreamPost
android-app
ios-app

IND vs ENG: వీడియో: స్టోక్స్‌పై రివేంజ్‌ తీర్చుకున్న అయ్యర్‌! ఇది కదా కావాల్సింది..

  • Published Feb 05, 2024 | 3:23 PM Updated Updated Feb 05, 2024 | 9:44 PM

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్​పై భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రివేంజ్ తీర్చుకున్నాడు. దీన్ని చూసిన అభిమానులు ఇది కదా మనకు కావాల్సింది అంటున్నారు.

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్​పై భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రివేంజ్ తీర్చుకున్నాడు. దీన్ని చూసిన అభిమానులు ఇది కదా మనకు కావాల్సింది అంటున్నారు.

  • Published Feb 05, 2024 | 3:23 PMUpdated Feb 05, 2024 | 9:44 PM
IND vs ENG: వీడియో: స్టోక్స్‌పై రివేంజ్‌ తీర్చుకున్న అయ్యర్‌! ఇది కదా కావాల్సింది..

క్రికెట్​లో రివేంజ్​లు మామూలే. బ్యాటర్లు, బౌలర్ల మధ్య వార్స్ నడుస్తుంటాయి. తనను ఔట్ చేశాడని.. అతడి బౌలింగ్​లో చెలరేగి ఆడేందుకు బ్యాట్స్​మెన్ ప్రయత్నిస్తుంటారు. తమ బౌలింగ్​లో పరుగులు పిండుకున్నాడు కాబట్టి అతడ్ని ఎలాగైనా ఔట్ చేయాలని బౌలర్లు శ్రమిస్తుంటారు. అలా ఆటగాళ్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం అనేది సాధారణమనే చెప్పాలి. అయితే ఇంగ్లండ్​తో జరుగుతున్న సిరీస్​లో మాత్రం ఇద్దరు బ్యాటర్ల మధ్య చిన్న వార్ నడిచింది. ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్​కు, భారత స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్​కు నడుమ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరిగింది. అయితే ఎట్టకేలకు ఇందులో అయ్యర్​దే పైచేయి అయింది. టీమిండియా బ్యాటర్ తన రివేంజ్​ను తీర్చుకున్నాడు. దీంతో అభిమానులు ఇది కదా కావాల్సింది అని అంటున్నారు. అసలు అయ్యర్-స్టోక్స్ మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో శ్రేయస్ అయ్యర్ (29), శుబ్​మన్ గిల్ (104) బ్యాటింగ్ చేస్తున్నారు. అప్పటికే వాళ్లిద్దరూ కలసి మూడో వికెట్​కు 81 పరుగులు జోడించారు. దీంతో ఈ జోడీని విడదీసేందుకు స్పిన్నర్ టామ్ హార్ట్​లీని రంగంలోకి దించాడు ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్. ఈ ప్లాన్ వర్కౌట్ అయి అయ్యర్ ఔటయ్యాడు. అతడు కొట్టిన బాల్ ఆఫ్ సైడ్ గాల్లోకి లేవగా స్టోక్స్ వెనుక వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతంగా క్యాచ్​ను ఒడిసి పట్టుకున్నాడు. అయితే క్యాచ్ పట్టాక ఆడియెన్స్ వైపు తన వేలిని చూపిస్తూ అసభ్యంగా సంజ్ఞ చేశాడు. దీన్ని గుర్తుపెట్టుకున్న అయ్యర్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్​లో బదులు తీర్చుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్​లో బెన్ ఫోక్స్ (36) ఓ బాల్​ను లెగ్ గల్లీలోకి కొట్టాడు. అటు ఫీల్డర్ లేకపోవడంతో సింగిల్ కోసం ప్రయత్నించాడు.

రన్ తీయాలా? వద్దా? అనే దానిపై స్టోక్స్, ఫోక్స్​కు కన్​ఫ్యూజర్ ఏర్పడింది. అయితే ఫోక్స్ నాన్​స్ట్రయికర్ ఎండ్ వైపు వెళ్లిపోవడంతో స్టోక్స్ స్ట్రయికింగ్ సైడ్ పరుగులు తీశాడు. ఈ గ్యాప్​లో స్క్వేర్​ లెగ్​లో ఉన్న అయ్యర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్​ను తీసుకొని నేరుగా వికెట్లకేసి కొట్టాడు. క్రీజుకు ఇంచు దూరంలో స్టోక్స్ ఉండగా బాల్ వికెట్లను గిరాటేసింది. రనౌట్ కావడంతో అతడు నిరాశగా పెవిలియన్​ వైపు చేసుకున్నాడు. అంతే భారత జట్టు మొత్తం సంబరాలు చేసుకుంది. తాను ఔట్ అయినప్పుడు ఎలాగైతే స్టోక్స్ వేలు చూపించాడో అయ్యర్ కూడా అలాగే సంజ్ఞ చేస్తూ స్టోక్స్​కు బైబై చెప్పాడు. ఇదే మ్యాచ్​లో తన రివేంజ్ తీర్చుకున్నాడు. ఈ వీడియో చూసిన అభిమానులు ఇది కదా కావాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అగ్రెషన్, ఫైర్​ను ఫీల్డింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ చూపించాలని సూచిస్తున్నారు. బ్యాట్​తో కూడా రాణిస్తే టీమ్​లో శ్రేయస్ ప్లేసు ఫిక్స్ అవుతుందని చెబుతున్నారు. మరి.. అయ్యర్-స్టోక్స్ వార్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.