iDreamPost

IND vs ENG: జడేజా కోసం ఇంగ్లండ్ ప్లాన్.. అక్షర్ ఎంట్రీతో మారిన సీన్!

  • Published Jan 25, 2024 | 4:12 PMUpdated Jan 25, 2024 | 4:12 PM

ఉప్పల్ టెస్ట్​లో ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపిస్తోంది భారత్. మన స్పిన్నర్ల దెబ్బకు స్టోక్స్ సేనకు మైండ్ బ్లాంక్ అయింది. ముఖ్యంగా అక్షర్ ఎంట్రీతో మ్యాచ్​లో మొత్తం సీన్ మారిపోయింది.

ఉప్పల్ టెస్ట్​లో ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపిస్తోంది భారత్. మన స్పిన్నర్ల దెబ్బకు స్టోక్స్ సేనకు మైండ్ బ్లాంక్ అయింది. ముఖ్యంగా అక్షర్ ఎంట్రీతో మ్యాచ్​లో మొత్తం సీన్ మారిపోయింది.

  • Published Jan 25, 2024 | 4:12 PMUpdated Jan 25, 2024 | 4:12 PM
IND vs ENG: జడేజా కోసం ఇంగ్లండ్ ప్లాన్.. అక్షర్ ఎంట్రీతో మారిన సీన్!

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఇదేంటి సాంగ్ పాడుతున్నారని అనుకుంటున్నారా? ఈ పాటలోని లిరిక్స్​కు ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు న్యాయం చేస్తోంది. ఎన్నో ఆశలతో భారత గడ్డ మీదకు అడుగుపెట్టింది ఇంగ్లీష్ టీమ్. ఇక్కడ రెండో టెస్ట్ సిరీస్ విజయం కోసం బోలెడు ఎక్స్​పెక్టేషన్స్​తో వచ్చింది. మిగతా జట్ల మీదలాగే టీమిండియాను కూడా బజ్​బాల్ క్రికెట్​తో భయపెడదామని భావించింది. సిరీస్ స్టార్టింగ్​కు ముందు ఇంగ్లండ్ మాజీలు, ప్రస్తుత జట్టులోని ప్లేయర్లు కూడా బజ్​బాల్ నామం జపించారు. భారత్​కు ఓటమి తప్పదని.. వేగంగా ఆడుతూ ఆ టీమ్​కు తమ కొత్త ఫార్ములా రుచి చూపిస్తామని బడాయికి పోయారు. కానీ వాళ్ల ప్లాన్ అట్టర్​ఫ్లాప్ అయింది. భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ వణుకుతోంది. ​అపోజిషన్ టీమ్ జడేజా, అశ్విన్ కోసం ప్లాన్ చేసుకొని వస్తే అనూహ్యంగా అక్షర్ పటేల్ వాళ్లకు షాకులు ఇచ్చాడు.

తొలి టెస్టులో ఇంగ్లండ్​ను భయపెడుతున్నాడు అక్షర్ పటేల్. ఆ జట్టు ప్రధాన బ్యాటర్ జానీ బెయిర్​స్టో (37)తో పాటు మంచి ఫామ్​లో ఉన్న బెన్ ఫోక్స్ (4)​ను అతడు వెనక్కి పంపాడు. ముఖ్యంగా బెయిర్​స్టోను పంపిన డెలివరీ అయితే అద్భుతం. వేగంగా మిడ్​ స్టంప్ మీద పడిన బంతి కాస్తా అనూహ్యంగా టర్న్ కావడంతో బెయిర్​స్టోకు ఏం చేయాలో పాలుపోలేదు. అతడు డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించినా బ్యాట్​ను దాటుకొని ఆఫ్ స్టంప్​ను గిరాటేసింది బాల్. ఆ తర్వాత ఫోక్స్​ను కూడా సూపర్బ్ డెలివరీతో పెవిలియన్​కు దారి చూపించాడు అక్షర్. ఇవాళ మ్యాచ్​లో అతడు వేసిన పేస్, క్విక్ టర్న్, వికెట్ టు వికెట్ బాల్స్​ సాధారణంగా జడేజా వేస్తుంటాడు.

Plan for Jadeja

అసాధారణ ఆటగాళ్లు అయిన స్టీవ్ స్మిత్, బెయిర్​స్టో లాంటి వారిని ఔట్ చేయాలంటే ఆ లెంగ్త్​లో, అలా టర్న్ చేసే బంతులు వేయాలి. దీంట్లో జడ్డూ ఎక్స్​పర్ట్. విచిత్రమైన బంతులతో స్మిత్, బెయిర్​స్టో లాంటి టాప్ బ్యాటర్స్​ను అతడు ఔట్ చేస్తుంటాడు. ఇంగ్లండ్ జట్టు కూడా జడేజా కోసం ఫుల్​గా ప్రిపేర్ అయింది. అతడికి వికెట్లు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఇంగ్లీష్ బ్యాటర్లు మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడారు. ఆ తర్వాత అటాక్ చేశారు. అయినా పిచ్, సిచ్యువేషన్​కు తగ్గట్లుగా బౌలింగ్ చేసి ముగ్గుర్ని వెనక్కి పంపాడు జడ్డూ. అయితే క్రీజులో నిలదొక్కుకున్న బెయిర్​స్టో ఔట్ కావడం లేదు. జడేజాతో పాటు అశ్విన్ బౌలింగ్​లోనూ వరుసగా బౌండరీలు కొట్టాడు. కానీ అతడ్ని ఓ మ్యాజికల్ డెలివరీతో ఔట్ చేశాడు అక్షర్.

ఆ బాల్​ అంత క్విక్​గా పడి అనూహ్యంగా టర్న్ అవుతుందని ఊహించని బెయిర్​స్టో బౌల్డ్ కావడంతో బిత్తరపోయాడు. అతడు కూడా జడ్డూ కోసం ప్రిపేర్ అయ్యాడు. కానీ అక్షర్ నుంచి సడన్​గా విచిత్రమైన బంతి వస్తుందని ఎక్స్​పెక్ట్ చేయలేదు. ఇక్కడే కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లానింగ్ వర్కౌట్ అయిందని చెప్పాలి. అక్షర్​ను అతడి బలంతో పాటు ఇతర వేరియేషన్స్​ను కూడా వాళ్లు ప్రాక్టీస్ చేయించడం ఇంగ్లండ్​కు సర్​ప్రైజ్​గా మారింది. వాళ్లు జడ్డూ కోసం ప్లాన్ చేస్తే అక్షర్ ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. ఈ సిరీస్​లో అక్షర్ ఇంకెన్ని విచిత్రమైన బంతులు వేస్తాడో చూడాలి. మరి.. అక్షర్ బౌలింగ్, టీమిండియా స్ట్రాటజీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి