Nidhan
భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత ఫీల్డింగ్‌కు దిగింది. మన జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత ఫీల్డింగ్‌కు దిగింది. మన జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Nidhan
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు ఫీల్డింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు జరిగింది. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఉద్దేశంతో ఈ మ్యాచ్‌కు దూరం పెట్టారు. అతడి స్థానంలో అనూహ్యంగా ఆకాశ్ దీప్‌కు తుదిజట్టులో చోటు లభించింది. ఇది అతడికి అరంగేట్ర మ్యాచ్ కావడం విశేషం. ఈ ఒక్క మార్పు తప్పితే టీమ్‌లో ఇంకే మార్పులు చేయలేదు. గత టెస్టులో ఆడిన 10 మంది ప్లేయర్లను కొనసాగించారు. పిచ్ నుంచి పేసర్లకు తొలుత మద్దతు లభిస్తుందని.. మ్యాచ్ గడిచే కొద్దీ స్పిన్నర్లకు టర్న్ లభించే అవకాశం ఉందని టాస్ టైమ్‌లో కామెంటేటర్ ఆర్పీ సింగ్ అన్నాడు.
డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్ దీప్‌కు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్యాప్ ఇచ్చి టీమ్‌లోకి ఆహ్వానించాడు. అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మిగతా ఆటగాళ్లు కూడా ఆకాశ్‌కు బెస్ట్ ఆఫ్ ది లక్ చెప్పారు. ఆకాశ్ టీమ్‌లోకి రావడంతో మరో యంగ్ పేసర్ ముఖేశ్ కుమార్‌కు నిరాశే మిగిలింది. ఇక, ఇంగ్లండ్ టీమ్ మ్యాచ్‌కు ముందు రోజే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ప్లేసులో బషీర్, మార్క్ వుడ్ స్థానంలో ఓలీ రాబిన్సన్ టీమ్‌లోకి వచ్చారు. కాగా, రాంచీ పిచ్ తొలి రోజు బ్యాటింగ్‌కు బాగా సహకరించే ఛాన్స్ ఉండటంతో స్టోక్స్ టాస్ నెగ్గగానే బ్యాటింగ్ తీసుకున్నాడు. భారత జట్టులో బుమ్రా లేడు కాబట్టి సిరాజ్, అశ్విన్ బౌలింగ్ యూనిట్‌ను లీడ్ చేయాల్సి ఉంటుంది. మరి.. నాలుగో టెస్టులో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
భారత జట్టు (ప్లేయింగ్ ఎలెవన్):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
England have won the toss and they’ve decided to bat first. pic.twitter.com/Ny7UTYvsQi
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2024