Nidhan
భారత్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం ఓ కొత్త ప్లేయర్‌ను దింపింది ఇంగ్లీష్ టీమ్.
భారత్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం ఓ కొత్త ప్లేయర్‌ను దింపింది ఇంగ్లీష్ టీమ్.
Nidhan
భారత్-ఇంగ్లండ్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సిరీస్‌లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో దుమ్మురేపేందుకు ఇరు టీమ్స్ ప్లేయర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 2-1తో లీడ్‌లో ఉన్న రోహిత్ సేనకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఇందులో నెగ్గితే సిరీస్‌ను 3-1తో పట్టేయొచ్చు. ఆఖరి టెస్టులో పర్యాటక జట్టు గెలిచినా సిరీస్‌ను సమం కూడా చేయలేదు. అందుకే రాంచీలోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే బజ్‌బాల్‌తో తొలుత భయపెట్టిన స్టోక్స్ సేన.. వరుసగా రెండు టెస్టుల్లో దారుణంగా ఓడిపోవడంతో టెన్షన్ పడుతోంది. వరుస ఓటములు, బజ్‌బాల్ వర్కౌట్ కాకపోవడంతో ఆ టీమ్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో నాలుగో టెస్ట్‌కు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఇంగ్లండ్.
ఎప్పటిలాగే టెస్ట్ మొదలవడానికి ఒక రోజు ముందే ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఇంగ్లీష్ టీమ్. రాంచీ టెస్ట్ కోసం తుదిజట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన పేసర్ మార్క్ వుడ్‌ను జట్టు నుంచి తప్పించింది. సిరీస్‌లో డిసైడర్‌గా మారిన నాలుగో టెస్ట్ కోసం సీమర్ ఓలీ రాబిన్సన్ను స్వదేశం నుంచి రప్పించింది. వుడ్ ప్లేసులో రాబిన్సన్ బరిలోకి దిగుతాడు. అలాగే లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను కూడా తీసేసింది. అతడి ప్లేసులో యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను ఫైనల్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాత ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ బ్యాటింగ్‌కు దిగుతారు. కీపింగ్ బాధ్యతల్ని బెన్ ఫోక్స్ మోస్తాడు. పేస్ రెస్పాన్సిబిలిటీని అండర్సన్, రాబిన్సన్ పంచుకుంటారు. స్పిన్నర్లుగా హార్ట్లీ, బషీర్‌కు తోడుగా రూట్ ఎలాగూ ఉన్నాడు.
రాంచీ టెస్టుకు భారత జట్టులో కూడా కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన టీమ్‌ను ఇంకా ప్రకటించలేదు. ఎప్పటిలాగే టాస్ టైమ్‌లోనే జట్టును ప్రకటించనున్నారు. అయితే ఈసారి టీమిండియాలో ఒక మార్పు జరగడం ఖాయం. వర్క్‌లోడ్ కారణంగా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు. దీంతో అతడి ప్లేసులో యంగ్ పేసర్ ముఖేష్ కుమార్ ఆడటం పక్కా అని తెలుస్తోంది. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడని అనుకుంటే ఇది సాధ్యం కాలేదు. గాయంతో బాధపడుతున్న అతడు పూర్తిగా రికవర్ కాకపోవడంతో రాంచీ టెస్టుకు దూరంగా ఉంచారు. కాబట్టి అతడి స్థానంలో ఆడుతున్న రజత్ పాటిదార్ ప్లేస్‌కు ఢోకా లేదనే చెప్పాలి. ఈ ఒకట్రెండు తప్పితే జట్టులో పెద్దగా మార్పులు జరిగేలా కనిపించడం లేదు. మరి.. ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆ రోజు టీమిండియా ప్లేయర్లంతా బీఫ్ తిన్నారు: పాకిస్థాన్ క్రికెటర్
England 11 for the third Test vs India:
Crawley, Duckett, Pope, Root, Bairstow, Stokes, Foakes, Anderson, Hartley, Bashir, Robinson pic.twitter.com/KcioI8UhIt
— Johns. (@CricCrazyJohns) February 22, 2024