IND vs ENG: టాస్‌ గెలిచిన భారత్‌! తొలుత బ్యాటింగ్.. ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో టీమిండియా ఏకంగా 4 మార్పులతో బరిలోకి దిగింది.

భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో టీమిండియా ఏకంగా 4 మార్పులతో బరిలోకి దిగింది.

భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టును చూద్దామని ఎదురుచూసిన ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడింది. సిరీస్​లో ఎంతో కీలకమైన ఈ మ్యాచ్​ ఇవాళ స్టార్ట్ అయింది. రాజ్​కోట్​ ఆతిథ్యం ఇస్తున్న ఈ టెస్టులో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని టాస్ సమయంలో హిట్​మ్యాన్ తెలిపాడు. తుది జట్టులో 4 మార్పులు చేశామని చెప్పాడు. కొత్త కుర్రాళ్లు ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్​తో అరంగేట్రం చేయనున్నారని అన్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ఒకవేళ తాము టాస్ గెలిచినా ముందు బ్యాటింగ్​కే దిగేవారమని చెప్పాడు. ఇక, ఈ మ్యాచ్ మొదలవడానికి ముందే ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ స్క్వాడ్​ను ప్రకటించింది. ఆ టీమ్​లో కేవలం ఒకే ఒక మార్పు జరిగింది. యంగ్ స్పిన్నర్ బషీర్ స్థానంలో స్పీడ్​స్టర్ మార్క్ వుడ్ టీమ్​లోకి వచ్చాడు. భారత జట్టు ఈ మ్యాచ్​లో ఏకంగా 4 మార్పులతో బరిలోకి దిగింది.

మూడో టెస్టులో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​లో నాలుగు మార్పులు చోటుచేసుకున్నాయి. గత రెండు టెస్టుల్లో ఆడిన వికెట్ కీపర్ కేఎస్ భరత్ స్థానంలో కొత్త కుర్రాడు జురెల్ టీమ్​లోకి వచ్చాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ ప్లేసులో సర్ఫరాజ్ ఖాన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. జురెల్, సర్ఫరాజ్​కు ఇదే అరంగేట్ర మ్యాచ్ కావడం విశేషం. దినేష్ కార్తీక్ జురెల్​కు టెస్ట్ క్యాప్ ఇచ్చి టీమ్​లోకి ఆహ్వానించాడు. సర్ఫరాజ్​కు లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే క్యాప్ ఇచ్చాడు. వీళ్లతో పాటు మరో రెండు మార్పులు జరిగాయి.

వైజాగ్ టెస్టులో ఆడిన పేసర్ ముకేష్​ కుమార్ స్థానంలో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్​ను రీప్లేస్ చేశారు. అలాగే ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ ప్లేసులో రవీంద్ర జడేజా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. మిగిలిన ప్లేయర్లు అందరూ అలాగే ఉన్నారు. కాగా, పిచ్​ బ్యాటింగ్​కు స్వర్గధామమని టాస్​కు ముందు పిచ్ రిపోర్టులో లెజెండ్ అనిల్ కుంబ్లే అన్నాడు. ఇక్కడ పేసర్లకు కాస్త మద్దతు ఉంటుందని, కానీ స్పిన్నర్లకు ఎలాంటి హెల్ప్ దొరకదని చెప్పాడు. పిచ్​పై బౌన్స్, స్వింగ్​కు ఛాన్స్ ఉందన్నాడు. ఈ మ్యాచ్ ఐదు రోజులు జరిగే అవకాశం ఉందన్నాడు. మరి.. ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

భారత జట్టు (ప్లేయింగ్ ఎలెవన్): 

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇదీ చదవండి: వీడియో: క్రికెట్‌ చరిత్రలోనే విచిత్రమైన ఘటన! రూల్‌ ప్రకారం..

Show comments