Nidhan
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా ఇవాళ మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు బ్రేక్ కానున్నాయి.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా ఇవాళ మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు బ్రేక్ కానున్నాయి.
Nidhan
భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు సర్వం సిద్ధమైంది. రాజ్‌కోట్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్ గురువారం ప్రారంభం కానుంది. వైజాగ్ టెస్టు తర్వాత దొరికిన గ్యాప్‌ను రెండు జట్లు వాడుకున్నాయి. భారత క్రికెటర్లు తమ ఇళ్లకు వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. ఇంగ్లీష్ ప్లేయర్లు అబుదాబికి వెళ్లి తమ కుటుంబ సభ్యులతో గడుపుతూ సేదతీరారు. అయితే రాజ్‌కోట్ టెస్టుకు సమయం దగ్గర పడటంతో రెండ్రోజుల ముందే ఇక్కడికి వచ్చేశారు. ఇరు టీమ్స్ జోరుగా ప్రాక్టీస్ చేశాయి. సిరీస్‌లో ఈ మ్యాచ్ నెగ్గడం కీలకంగా మారడంతో రెండ్రోజుల పాటు సాధనలో మునిగితేలాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే తమ తుదిజట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. స్పిన్నర్ బషీర్ ప్లేసులో పేసర్ మార్క్ వుడ్ టీమ్‌లోకి వచ్చాడు. భారత ప్లేయింగ్ ఎలెవన్ ఏంటనేది టాస్ టైమ్‌లో తేలనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు బ్రేక్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
రాజ్‌కోట్ టెస్టులో చాలా పాత రికార్డులు బద్దలవడానికి ఎదురు చూస్తున్నాయి. భారత జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకం కానుంది. ఎందుకంటే వాళ్లిద్దరూ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నారు. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్లో చేరేందుకు అశ్విన్ ఇంకో వికెట్ తీస్తే చాలు. మొదటి ఇన్నింగ్స్‌లోనే అతడు ఈ ఘనత అందుకోవడం ఖాయం. ఇక, అండర్సన్ మరో 5 వికెట్లు పడగొడితే 700 వికెట్ల క్లబ్లో జాయిన్ అవుతాడు. తద్వారా ఈ క్లబ్లో జాయిన్ అయిన మూడో బౌలర్‌గా రికార్డు సాధించే అవకాశం ఉంది.
క్రికెట్లో ఇప్పటిదాకా ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) మాత్రమే ఈ ఘనత సాధించారు. కాగా, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు మూడో టెస్టు ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది. టెస్టుల్లో ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఒకవేళ లాంగ్ ఫార్మాట్లో ఆడే ఛాన్స్ వస్తే వంద టెస్టులు పూర్తి చేయాలనేది మరో డ్రీమ్. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఫీట్‌ను నమోదు చేస్తారు. రాజ్‌కోట్ టెస్టుతో ఆ క్లబ్లో జాయిన్ అవనున్నాడు స్టోక్స్. ఇది అతడి కెరీర్లో 100వ టెస్టు కానుంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి చిరస్మరణీయం చేసుకోవాలని అతడు భావిస్తున్నాడు. ఇక, ఈ మ్యాచ్‌లో భారత జట్టులో అనూహ్య మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
వికెట్ కీపర్ కేఎస్ భరత్ ప్లేసులో కొత్త కుర్రాడు ధృవ్ జురెల్, శ్రేయస్ అయ్యర్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ లేదా దేవ్‌దత్ పడిక్కల్ ఎంట్రీ ఇవ్వడం పక్కా అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే టీమిండియా తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేసినట్లు అవుతుంది. ఇలా చాలా మంది ప్లేయర్లకు ఈ మ్యాచ్ మెమరబుల్‌గా నిలిచిపోయే ఛాన్స్ ఉంది. ఈ రికార్డులతో పాటు మ్యాచ్‌లో ప్లేయర్లు తమ ఆటతీరుతో ఇంకా సరికొత్త రికార్డులను సృష్టించే ఛాన్స్ కూడా ఉంది. మరి.. భారత్-ఇంగ్లండ్ టెస్టులో అశ్విన్, అండర్సన్ రేర్ ఫీట్స్ నమోదు చేస్తారని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచేది టీమిండియానే.. జై షా ఆసక్తికర వ్యాఖ్యలు!
– Ashwin needs 1 wicket to complete 500 wickets.
– Anderson needs 5 wickets to complete 700 wickets.
– Ben Stokes going to play his 100th Test match.
– Two likely Debutants for India.Rajkot Test is going to be memorable….!!!! pic.twitter.com/0RPI4pr5tF
— Johns. (@CricCrazyJohns) February 14, 2024