IND vs ENG: ఇంగ్లండ్​తో మూడో టెస్టు.. 4 మార్పులతో బరిలోకి భారత్!

భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు అంతా రెడీ అయింది. రాజ్​కోట్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు అంతా రెడీ అయింది. రాజ్​కోట్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

భారత్-ఇంగ్లండ్ మధ్య మరో ఆసక్తికర పోరుకు సర్వం సిద్ధమైంది. రాజ్​కోట్ వేదికగా ఇరు టీమ్స్ మధ్య గురువారం నాడు మూడో టెస్టు మొదలవనుంది. వైజాగ్ టెస్ట్ తర్వాత గ్యాప్ దొరకడంతో ఇరు జట్ల ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నారు. ఇంగ్లీష్ ప్లేయర్స్ అబుదాబి వెళ్లి వాళ్ల ఫ్యామిలీస్​తో గడిపారు. భారత క్రికెటర్లు సొంత ఇళ్లకు వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. మ్యాచ్ టైమ్ దగ్గర పడటంతో రెండ్రోజులు ముందుగానే రాజ్​కోట్ చేరుకున్నారు. ఇరు టీమ్స్ నెట్స్​లో కఠోర సాధన చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిరీస్​ 1-1తో సమమైంది కాబట్టి ఆధిక్యం సాధించాలంటే ఈ మ్యాచ్​లో నెగ్గడం అటు భారత్​కు, ఇటు ఇంగ్లండ్​కు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

రాజ్​కోట్ టెస్టులో భారత జట్టులో 4 మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్​లో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా గత మ్యాచ్​లో డబుల్ సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్ దిగడం తథ్యం. విరాట్ కోహ్లీ ఆడట్లేదు కాబట్టి వైజాగ్ టెస్టులో సెంచరీ బాదిన శుబ్​మన్ గిల్ ఫస్ట్ డౌన్​లో దిగుతాడు. కేఎల్ రాహుల్ ప్లేసులో గత మ్యాచ్​లో ఆడిన రజత్ పాటిదార్​ను కంటిన్యూ చేయొచ్చు. రెండో టెస్టులో విఫలమైనా అతడికి మరో ఛాన్స్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్​మెంట్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్​ను సెలక్ట్ చేయలేదు కాబట్టి అతడి ప్లేసులో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేయడం ఖాయం. అలాగే ధృవ్ జురెల్ కూడా ఈ మ్యాచ్​తో ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఎంట్రీ ఇవ్వడం పక్కాగా కనిపిస్తోంది.

వికెట్ కీపర్ కేఎస్ భరత్ వరుసగా నిరాశపర్చడంతో అతడి ప్లేసులో జురెల్​కు ఛాన్స్ ఇద్దామని టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తోంది. అందుకు తగ్గట్లే ప్రాక్టీస్​లో జురెల్​తో కీపింగ్ చేయించారు. స్లిప్​లో సర్ఫరాజ్, పటిదార్ సాధన చేశారు. దీంతో రేపటి మ్యాచ్​లో భారత మిడిలార్డర్ భారాన్ని వీళ్లు మోయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక స్పిన్ ఆల్​రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వ్యవహరిస్తారు. గత రెండు మ్యాచుల్లో ఆడిన అక్షర్ పటేల్ బాగానే రాణిస్తున్నప్పటికీ జడేజా ఫిట్​నెస్ సాధించడంతో అతడి ప్లేసుకు గండం ఏర్పడింది. అశ్విన్, జడ్డూకు జతగా స్పిన్ స్పెషలిస్ట్​గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు. పేస్ యూనిట్​ను జస్​ప్రీత్ బుమ్రా ముందుండి నడిపిస్తాడు. మహ్మద్ సిరాజ్​ ఫిట్​నెస్ నిరూపించుకోవడంతో వైజాగ్ టెస్టులో ఆడిన ముకేష్ కుమార్​ బెంచ్​కే పరిమితం కావొచ్చు. మరి.. ఈ మ్యాచ్​లో టీమిండియా ఫైనల్ ఎలెవన్​లో ఇంకేమైనా మార్పులు ఉండే ఛాన్స్ ఉందని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

భారత జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్​మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇదీ చదవండి: Ishan Kishan: BCCI స్ట్రాంగ్ వార్నింగ్.. ఎట్టకేలకు దిగొచ్చిన ఇషాన్ కిషన్!

Show comments