SNP
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
క్రికెట్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ హైఓల్టేజ్ టెస్ట్ సిరీస్.. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 25 నుంచి మార్చి 11వ తేదీ వరకు ఏకంగా 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్ జరగనుంది. ఇండియా-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌కు క్రికెట్ అభిమానుల్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అసలు సిసలైన క్రికెట్ మజాను ఆస్వాదించేందుకు ఈ సిరీస్‌ను ఫ్యాన్స్ ఎక్కువగా వీక్షిస్తుంటారు. అయితే.. ఈ లాంగ్ సిరీస్.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌తోనే ప్రారంభం కానుంది.
ఈ నెల 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే 5000 మంది స్కూల్ పిల్లలకు, అలాగే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పించనుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అయితే.. మరి సాధారణ ప్రేక్షకుల కోసం టిక్కెట్ విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్ ద్వారా టికెట్స్‌ను విక్రయించనున్నారు.
పేటీమ్ ఇన్‌సైడర్ యాప్‌తో పాటు, www.insider.inలో కూడా టికెట్స్ బుక్‌చేసుకోవచ్చని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. అయితే ఆన్‌లైన్ టికెట్స్‌ను జనవరి 22న జింఖానా గ్రౌండ్స్‌లో గుర్తింపు రుజువుతో రీడీమ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కార్పొరేట్ బాక్స్‌ల కోసం టిక్కెట్ ధర రూ.200 నుంచి రూ.4000 మధ్య ఉంది. ఇతర కేటగిరీల్లో రూ.600 నుంచి రూ.16000 వరకు ధర ఉన్నాయి. ఇక రిటేల్ టికెట్లను 22న జింఖానా గ్రౌండ్స్‌లో విక్రయించనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌ను నేరుగా గ్రౌండ్‌కి వెళ్లి చూసేందుకు మీరూ టికెట్లు బుక్ చేసుకోండి.