Nidhan
ఓ టీమిండియా విమెన్ క్రికెటర్ సెన్సేషనల్ క్యాచ్ పట్టి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ క్యాచ్‌తో లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసింది.
ఓ టీమిండియా విమెన్ క్రికెటర్ సెన్సేషనల్ క్యాచ్ పట్టి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ క్యాచ్‌తో లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసింది.
Nidhan
క్రికెట్ అంటే చాలా మంది బ్యాటింగ్, బౌలింగ్ అనే అనుకుంటారు. అందుకే స్టార్ బ్యాటర్లు, బౌలర్లకు భారీగా ఫ్యాన్‌బేస్ ఉంటుంది. కానీ జెంటిల్మన్ గేమ్‌లో ఫీల్డింగ్‌కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ ఎంత ముఖ్యమో మ్యాచ్ గెలవాలంటే ఫీల్డింగ్ కూడా అంతే ముఖ్యం. అయితే బ్యాటర్లు, బౌలర్లకు వచ్చినంత పేరు ఫీల్డర్లకు రాదు. ఒకప్పుడు క్రికెట్లో ఫీల్డింగ్‌కు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో దీని ప్రాముఖ్యతను అన్ని టీమ్స్ గుర్తిస్తున్నాయి. అందుకే తమ ఫీల్డింగ్‌ను మరింత బలోపేతం చేసుకోవడం మీద ఫోకస్ చేస్తున్నాయి. మెన్స్ క్రికెట్‌తో పాటు విమెన్స్ క్రికెట్లోనూ ఫీల్డింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. దీని రిజల్ట్ కూడా కనిపిస్తోంది. తాజాగా ఓ టీమిండియా విమెన్ క్రికెటర్ సెన్సేషనల్ క్యాచ్‌తో అందర్నీ ఆశ్చర్యపర్చింది.
భారత మహిళ క్రికెటర్ స్నేహా రానా పట్టిన ఆ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండియా విమెన్, ఆస్ట్రేలియా విమెన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆసీస్ ఓపెనర్ అలీసా హీలీ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతమైన రీతిలో ఎడమ వైపునకు గాలిలో దూకుతూ అందుకుంది స్నేహ. క్యాచ్ పట్టిన టైమ్‌లో ఆమె శరీరం మొత్తం గాల్లోనే ఉంది. అయినా ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా, బాల్ చేజారకుండా గట్టిగా హోల్ట్ చేసింది స్నేహ. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ అలీసాతో పాటు స్టేడియంలోని ఆడియెన్స్ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత కోలుకొని చప్పట్లు కొడుతూ స్నేహ ఎఫర్ట్‌ను మెచ్చుకున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 282 రన్స్ చేసింది.
టీమిండియాలో యషికా భాటియా (49), జెమీమా రోడ్రిగ్స్ (82) రాణించారు. ఆఖర్లో పూజా వస్త్రాకర్ (62) ధనాధన్ ఇన్నింగ్స్‌తో టీమ్‌కు భారీ స్కోరు అంచింది. ఛేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 156 పరుగులతో ఉంది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (71 నాటౌట్), బెత్ మూనీ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో స్నేహా రేణుకా పట్టిన క్యాచ్ హైలైట్ అని చెప్పాలి. దీన్ని చూసిన నెటిజన్స్ ఆమెను లేడీ యువరాజ్ అని పిలుస్తున్నారు. గతంలో భారత పురుషుల జట్టు తరఫున ఆడుతూ యువీ పట్టిన డైవింగ్ క్యాచెస్ను గుర్తుచేస్తున్నారు. యువీలాగే గాల్లో ఎగురుతూ స్నేహ క్యాచ్ పట్టుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. స్నేహా రానా సూపర్బ్ క్యాచ్ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ambati Rayudu: YCPలో చేరిన అంబటి రాయుడు.. పొలిటికల్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు!
Sensational flying catch. 🔥 pic.twitter.com/YjpR0PFdYS
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2023