Ishan Kishan: పాపం ఇషాన్ కిషన్​.. సెలక్టర్ల చేతిలో టాలెంటెడ్ ప్లేయర్ బలి!

టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్​కు మరోమారు అన్యాయం జరిగింది. ఈ విషయం తెలిసిన అభిమానులు.. పాపం ఇషాన్ అంటున్నారు. సెలక్టర్ల చేతిలో మరో టాలెంటెడ్ ప్లేయర్ బలయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు.

టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్​కు మరోమారు అన్యాయం జరిగింది. ఈ విషయం తెలిసిన అభిమానులు.. పాపం ఇషాన్ అంటున్నారు. సెలక్టర్ల చేతిలో మరో టాలెంటెడ్ ప్లేయర్ బలయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతిభకు తగిన ప్రోత్సాహం అందితే వచ్చే ఫలితాలు మామూలుగా ఉండవు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహిస్తే అద్భుతాలు చేసి చూపిస్తారు. ఒక ప్లేయర్​ను పైకి తీసుకురావాలన్నా, కిందకు పడేయాలన్నా అది సెలక్టర్ల చేతుల్లోనే ఉంటుంది. అరకొర టాలెంట్ ఉండి సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా సెలక్టర్ల అండతో గట్టెక్కే ఆటగాళ్లు కొంతమంది ఉన్నారు. అదే టైమ్​లో చాలా ప్రతిభ ఉన్నా, వచ్చిన ఛాన్సుల్ని వినియోగించుకొని పెర్ఫార్మ్ చేసినా అణచివేతకు గురయ్యే ఆటగాళ్లూ ఉన్నారు. ఇప్పుడీ లిస్టులో చేరాడు భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్​మన్ ఇషాన్ కిషన్. హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీస్​తో పాటు అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యం ఉన్న ఇషాన్​కు మరోసారి అన్యాయం జరిగింది. సెలక్టర్ల చేతిలో ఈ టాలెంటెడ్ ప్లేయర్ బలయ్యాడు. ఆఫ్ఘానిస్థాన్​తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్​లో ఇషాన్​కు చోటు దక్కలేదు.

ఆఫ్ఘాన్​తో టీ20 సిరీస్​కు 16 మందితో కూడిన స్క్వాడ్​ను ప్రకటించారు సెలక్టర్లు. అయితే ఇందులో ఇషాన్​కు స్థానం దక్కలేదు. టీ20ల్లో రెగ్యులర్ ప్లేయర్ అయిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ కంటిన్యూగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అద్భుతమైన ఇన్నింగ్స్​లతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అలాంటి ప్లేయర్​ను ఆఫ్ఘాన్​ సిరీస్​కు ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదు. అతడ్ని ఎందుకు తీసుకోలేదో కనీసం రీజన్ కూడా చెప్పలేదు. టీ20 ప్రపంచ కప్​కు ముందు భారత్​కు ఇదే లాస్ట్ టీ20 సిరీస్. ఇందులో అతడ్ని ఆడించలేదంటే మెగాటోర్నీలో తీసుకోబోమని ఇన్​డైరెక్ట్​గా హింట్ ఇచ్చినట్లే. దీంతో మరో టాలెంటెడ్ ప్లేయర్ కెరీర్​ను సెలక్టర్లు నాశనం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. పాపం ఇషాన్ టాలెంట్​ వృథా అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో సెలక్టర్లు ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. వన్డే వరల్డ్ కప్​ ముందు అక్షర్ పటేల్ విషయంలోనూ ఇలాగే వ్యవహరించి విమర్శల పాలయ్యారు. వన్డే ప్రపంచ కప్​-2023కి ముందు వరకు స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్​ను అన్ని వన్డే సిరీస్​ల్లోనూ ఆడించారు. బ్యాట్​తో విలువైన రన్స్ చేస్తూ, లెఫ్టార్మ్ స్పిన్​తో కీలక వికెట్లు తీస్తూ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు అక్షర్. ఆసియా కప్-2023​లోనూ అతడు రాణించాడు. అయినా గాయం సాకు చూపి రికవర్ అయిన అక్షర్​ను వరల్డ్ కప్​కు దూరం పెట్టారు. అతడి ప్లేస్​లో 50 ఓవర్ల ఫార్మాట్​కు చాన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ను సెలక్ట్ చేశారు. ఇప్పుడు ఇషాన్ కిషన్ విషయంలోనూ సెలక్టర్లు ఇలాగే వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

కంటిన్యూగా పెర్ఫార్మ్ చేస్తున్న కిషన్​ను ఇలా అకస్మాత్తుగా పక్కన పెట్టడం, ఎందుకు తీసుకోలేదో రీజన్ కూడా చెప్పకపోవడం దారుణమని నెట్టింట అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మెంటల్ ఫెటీగ్ (మానసిక అలసట) కారణంగా ఇషాన్ ఆఫ్ఘాన్ సిరీస్​కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడని కొందరు అంటున్నారు. అయితే ఇందులో ఎందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. కానీ నెటిజన్స్​తో పాటు ఇషాన్ ఫ్యాన్స్ మాత్రం సెలక్టర్లపై సీరియస్ అవుతున్నారు. కిషన్​కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఇషాన్ విషయంలో సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్​కు భారీ షాక్.. మ్యాచ్ విన్నర్ దూరం!

Show comments