రోహిత్, కోహ్లీ కాదు.. సూపర్-8లో టీమిండియాకు అతడే కీలకం: ఫ్లెమింగ్

సూపర్-8కు సిద్ధమవుతోంది టీమిండియా. గ్రూప్ దశలో మాదిరిగానే ఎదురొచ్చిన ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని భావిస్తోంది.

సూపర్-8కు సిద్ధమవుతోంది టీమిండియా. గ్రూప్ దశలో మాదిరిగానే ఎదురొచ్చిన ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని భావిస్తోంది.

సూపర్-8కు సిద్ధమవుతోంది టీమిండియా. గ్రూప్ దశలో మాదిరిగానే ఎదురొచ్చిన ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని భావిస్తోంది. సూపర్ పోరులో భాగంగా తొలి మ్యాచ్​లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్​ను ఫేస్ చేయనుంది మెన్ ఇన్ బ్లూ. తర్వాతి మ్యాచుల్లో ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాతో పాటు బంగ్లాదేశ్​ను ఢీకొంటుంది. ఈ మూడు జట్లు కూడా కరీబియన్ పిచ్​లపై గ్రూప్ దశ మ్యాచ్​లు ఆడి మంచి అనుభవం సంపాదించాయి. అక్కడి స్లో వికెట్లపై ఎలా ఆడాలనే కిటుకును గ్రహించాయి. ఎలా బ్యాటింగ్ చేయాలి, ఏ లెంగ్త్​లో బౌలింగ్ చేయాలనేది అర్థం చేసుకున్నాయి. అదే యూఎస్​ఏ నుంచి వచ్చిన భారత్.. ఇక్కడి పిచ్​లకు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తోంది.

విండీస్‌ పిచ్​లపై ఆడిన అనుభవం ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై టీమిండియా అతిగా ఆధారపడుతోంది. వీళ్లిద్దరి మ్యాజిక్​తో సూపర్-8 గండాన్ని అధిగమించాలని చూస్తోంది. అయితే న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియాకు అసలైన ఆయుధం కుల్దీప్ యాదవ్ అని అన్నాడు. సూపర్-8, సెమీస్ లాంటి హై టెన్షన్ మ్యాచుల్లో జట్టును అతడే గట్టెక్కిస్తాడని చెప్పాడు. కుల్దీప్​ను నమ్ముకుంటే భారత్​కు తిరుగుండదని తెలిపాడు. కరీబియన్ పిచ్​ల నుంచి స్పిన్​కు ఏమాత్రం సపోర్ట్‌ దొరికినా కుల్దీప్ చెలరేగుతాడన్నాడు. మిడిల్ ఓవర్లు అనే కాదు.. టీమ్​కు అవసరమైన ప్రతిసారి కుల్దీప్​ను ఉపయోగించి సక్సెస్ అవ్వొచ్చని సూచించాడు. ఎంతటి బ్యాటర్​నైనా కంగుతినిపించే సత్తా అతడికి ఉందన్నాడు ఫ్లెమింగ్.

మెగా టోర్నీ ముగింపు దశకు చేరే కొద్దీ విండీస్ వికెట్లు మరింత స్పిన్ ఫ్రెండ్లీగా మారతాయని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. కాబట్టి పిచ్​ నుంచి దక్కే మద్దతును స్పిన్నర్లు వాడుకోవాలని సజెషన్ ఇచ్చాడు. టీమిండియా చాలా పటిష్టంగా ఉందన్నాడు. జట్టులో గట్టి పోటీ ఉండటంతో యశస్వి జైస్వాల్ లాంటోడ్ని కూడా పక్కనబెట్టారని తెలిపాడు. భారత స్క్వాడ్​లో నలుగురు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారని.. వెస్టిండీస్ కండీషన్స్​ను దృష్టిలో పెట్టుకునే ఇలా సెలెక్ట్ చేశారన్నాడు. ఇది అద్భతమైన వ్యూహమని మెచ్చుకున్నాడు. వికెట్ల నుంచి స్పిన్నర్లకు ఊహించిన రేంజ్​లో మద్దతు లభిస్తే రోహిత్ సేనను ఆపడం ఎవరి వల్లా కాదని ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. భారత సెలెక్టర్లు తెలివిగా ఆలోచించి స్పిన్నర్లకు టీమ్​లో చోటు ఇచ్చారని.. ఇక వాళ్లు తమను తాము నిరూపించుకోవాలన్నాడు. మరి.. ఫ్లెమింగ్ చెప్పినట్లు కుల్దీప్ భారత్​కు కీలకం అవుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments