ఇండియా మ్యాచ్​పై మైకేల్ వాన్ సెటైర్స్.. ఇచ్చిపడేసిన ఫ్యాన్స్!

  • Author singhj Published - 02:12 PM, Thu - 12 October 23
  • Author singhj Published - 02:12 PM, Thu - 12 October 23
ఇండియా మ్యాచ్​పై మైకేల్ వాన్ సెటైర్స్.. ఇచ్చిపడేసిన ఫ్యాన్స్!

వన్డే వరల్డ్ కప్​-2023 రోజులు గడుస్తున్న కొద్దీ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఒక్కో మ్యాచ్​తో మెగా టోర్నీపై అభిమానుల్లో ఇంట్రెస్ట్ మరింత పెరుగుతోంది. వార్మప్ మ్యాచులకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. టీమిండియా ఆడిన రెండు మ్యాచులూ వరుణుడి వల్ల రద్దయ్యాయి. దీంతో వరల్డ్ కప్​ సజావుగా సాగుతుందా? వాన వల్ల మ్యాచులు తుడిచిపెట్టుకుపోతాయేమోననే సందేహాలు నెలకొన్నాయి. కానీ టోర్నీ ఆరంభం అయ్యాక వర్షం ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు. అయితే భారత్ ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్​లో స్టేడియాలు ఫ్యాన్స్​తో నిండట్లేదని.. ఖాళీ గ్రౌండ్స్ కనిపిస్తున్నాయని కొందరు విమర్శిస్తున్నారు.

స్టేడియాలకు అభిమానులు రాట్లేదనే విమర్శల్లో కొంత వాస్తవం ఉంది. మొదటి రెండు, మూడు మ్యాచులకు ఫ్యాన్స్ పెద్దగా రాలేదు. కానీ క్రమంగా గ్రౌండ్స్​కు జనాలు భారీగా వస్తున్నారు. బుధవారం టీమిండియా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​కు కూడా ఆడియెన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాత్రం ఇండియా మ్యాచ్​కు ఢిల్లీ స్టేడియంలో ఖాళీ సీట్లు ఉన్నాయని సెటైర్స్ వేశాడు.  వాన్ నోటి దూలకు ఇండియన్ ఫ్యాన్స్ దిమ్మతిరిగే రీతిలో కౌంటర్ ఇచ్చారు. ‘వాన్.. ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది. సాయంత్రానికి చూడు.. స్టేడియం ఫుల్ అవుతుంది’ అని ఒకరు ట్వీట్ చేశారు.

మైకేల్​ వాన్​ కామెంట్స్​కు రిప్లయ్​గా సాయంత్రం వేళ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం ఫ్యాన్స్​తో పూర్తిగా నిండి ఉన్న వీడియోలను అభిమానులు షేర్ చేశారు. ‘ఢిల్లీలో మధ్యాహ్నం టైమ్​లో ఎండ ఎక్కువగా ఉంటుందని.. అందుకే ఈవినింగ్ వెళ్తారని’ కొందరు కామెంట్స్ చేశారు. ‘ఇది వీకెండ్ కాదు.. జాబ్స్​కు వెళ్లి సాయంత్రం వేళ మ్యాచ్​ చూసేందుకు వస్తారు’ అని మరికొందరు కౌంటర్ ఇచ్చారు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా దీనిపై స్పందించాడు. ‘వాన్.. నువ్వు మ్యాచ్ చూస్తున్నావా? ఖాళీగా ఉన్న గ్రౌండ్సా?’ అని ప్రశ్నించాడు. భారత్​పై అక్కసు వెళ్లగక్కిన మైకేల్ వాన్​పై మొత్తానికి ఇలా తిక్క కుదిర్చారు నెటిజన్స్. ఇండియన్ ఫ్యాన్స్ అంటే ఏంటో వాన్​కు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. మరి.. ఇండియా మ్యాచ్​పై వాన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌.. భారత చెత్త బౌలర్ల లిస్ట్‌లో చేరిన సిరాజ్‌!

Show comments