Nidhan
టీమిండియా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య ఇవాళ తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య ఇవాళ తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఈ ఏడాది జూన్ 1వ తేదీన టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. ఈ పొట్టి కప్‌పై కన్నేసిన టీమిండియా.. దీని కంటే ముందు టీ20 ఫార్మాట్లో చివరి సిరీస్ ఆడేందుకు రెడీ అయింది. ఆఫ్ఘానిస్థాన్‌తో మూడు మ్యాచుల సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది భారత్. ఈ సిరీస్‌లోని తొలి టీ20 గురువారం జరగనుంది. 14 నెలల గ్యాప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి చేరారు. అయితే పర్సనల్ రీజన్స్ వల్ల కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇంజ్యురీ వల్ల హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో లేకుండా పోయారు. టీ20ల్లో కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేస్తున్న ఇషాన్ కిషన్ కూడా ఈ సిరీస్‌లో ఆడట్లేదు. ఎక్కువగా యువకులతో నిండిన భారత జట్టు కొత్తగా కనిపిస్తోంది. తొలి టీ20లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
ఫస్ట్ టీ20లో భారత జట్టులో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఫస్ట్ డౌన్లో శుబ్‌మన్ గిల్ ఎలాగూ ఉన్నాడు. విరాట్ కోహ్లీ లేడు కాబట్టి అతడి ప్లేస్‌లో తిలక్ వర్మ ఆడే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా సౌతాఫ్రికా టూర్లో రాణించిన జితేష్ శర్మను టీమ్‌లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ప్రొటీస్ టూర్లో వన్డేల్లో సెంచరీతో మెరిసిన సంజూ శాంసన్ అతడికి గట్టి పోటీని ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ ఎవరిని తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఫినిషర్ రోల్‌ను రింకూ సింగ్ నిర్వర్తించనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ గ్రౌండ్లోకి దిగడం ఖాయం. మెయిన్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌ల్లో ఎవర్ని ఆడిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. బిష్ణోయ్‌కు బ్యాటింగ్ చేసే ఎబిలిటీ కూడా ఉంది. కాబట్టి అతడ్ని తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
పేస్ బౌలింగ్ బాధ్యతల్ని అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్ మోస్తారు. పేస్ బౌలింగ్, బ్యాటింగ్, ఆల్‌రౌండర్స్ పరంగా అందరి ప్లేసులు పక్కాగా కనిపిస్తున్నాయి. కానీ వికెట్ కీపర్, మెయిన్ స్పిన్నర్‌గా ఎవర్ని ఆడిస్తారనేది చూడాలి. ఫస్ట్ టీ20కి ఆతిథ్యం ఇస్తున్న మొహాలీ పిచ్ ఈ మధ్య కాలంలో పూర్తి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారింది. కాబట్టి ఇక్కడ టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపుతుంది. అయితే ప్రయోగాలు చేయాలంటే భారత్ మొదటి మ్యాచ్ నుంచే స్టార్ట్ చేయాలి. సిరీస్ గెలవడం కంటే టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం మీద ఫోకస్ చేస్తే బెటర్. ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్లుగా పెర్ఫార్మ్ చేస్తే సిరీస్ నెగ్గడం పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి ఏ ప్లేయర్‌ను ఎప్పుడు బరిలోకి దిగాలి? ఎవరి రోల్ ఏంటి? వరల్డ్ కప్‌లో ఎవరెవరు పక్కాగా ఆడతారు? అనే విషయంలో టీమ్ మేనేజ్మెంట్ క్లారిటీ తెచ్చుకోవాలి. మరి.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంకా ఎవరైనా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్/జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్.
ఇదీ చదవండి: సచిన్, కోహ్లీ కాదు.. ఆ టీమిండియా క్రికెటర్ కు నేను అభిమానిని: డివిలియర్స్