iDreamPost
android-app
ios-app

ఇండియన్ వన్డే జెర్సీపై నెట్టింట కొత్త చర్చ.. అసలు 3 స్టార్స్ ఎందుకు?

IND vs SL- Team India Odi Jersey Got 3 Stars On It Why: శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే సిరీస్ జెర్సీపై నెట్టింట కొత్త చర్చ మొదలైంది. అసలు ఆ జెర్సీపై ఎందుకు 3 స్టార్స్ ఉన్నాయి అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొందరు ఆ ప్రశ్నలకు ఇలాంటి సమాధానాలు చెబుతున్నారు.

IND vs SL- Team India Odi Jersey Got 3 Stars On It Why: శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే సిరీస్ జెర్సీపై నెట్టింట కొత్త చర్చ మొదలైంది. అసలు ఆ జెర్సీపై ఎందుకు 3 స్టార్స్ ఉన్నాయి అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొందరు ఆ ప్రశ్నలకు ఇలాంటి సమాధానాలు చెబుతున్నారు.

ఇండియన్ వన్డే జెర్సీపై నెట్టింట కొత్త చర్చ.. అసలు 3 స్టార్స్ ఎందుకు?

టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక 2024లో భాగంగా 3 వన్డేల సిరీస్ నడుస్తోంది. తొలి మ్యాచ్ టై అయిన సంగతి తెలిసిందే. వన్డేల్లో సూపర్ ఓవర్ ఉండదు కాబట్టి. ఆ మ్యాచ్ లో ఫలితం తేలనట్లే. ఇప్పుడు జరగబోయే రెండు మ్యాచుల్లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో.. వారిదే సిరీస్. ఆదివారం రెండో వన్డే మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. టీమిండియా తొలి వన్డేలో తప్పులను సరిచేసుకుని గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు టీమిండియా జెర్సీపై కొత్త చర్చ నడుస్తోంది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో జెర్సీపై 3 స్టార్స్ ఉండటంపై నెట్టింట కొందరు ప్రశ్నలు లేవనెత్తుతుండగా.. కొందరు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ చర్చ ఏంటో చూద్దాం.

మ్యాచ్ జరిగిన తర్వాత చాలా మంది ఫలితం గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు. కానీ, ఇప్పుడు గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఈ 3 స్టార్స్ గురించే చర్చ జరుగుతోంది. పైగా టీ20 జెర్సీ మీద 2 స్టార్స్ ఉన్నప్పుడు.. వన్డే జెర్సీపై 3 స్టార్స్ ఎందుకు ఉంచినట్లు అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఆ స్టార్స్ ని.. టీమ్ గెలిచిన వరల్డ్ కప్స్ కి ప్రతీకగా ముద్రిస్తారు. రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ సాధించాం కాబట్టి రెండు స్టార్స్ ని పెట్టారు అని క్లారిటీ ఉంది. కానీ.. 1983 వన్డే వరల్డ్ కప్, 2017 వన్డే వరల్డ్ కప్ ని సాధించిన టీమిండియా కేవలం 2 స్టార్స్ ని కదా కలిగి ఉండాలి అని అనుమానాలు, ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఇక్కడ వారి ఇంట్రస్ట్ టీమిండియాని ప్రశ్నించడం కాదు.. ఎవరికైనా ఆ మూడో స్టార్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం ఏదైనా తెలిస్తే చెప్పండి అని కోరుతున్నారు. ఇందుకు కొందరు నెటిజన్స్ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా లెక్కలో వేసుకుని అలా పెట్టారేమో అనుకుంటున్నారు. కానీ, అలాంటప్పుడు టీమిండియా రెండు ఛాంపియన్ ట్రోఫీలను కైవసం చేసుకుంది. అంటే నాలుగు స్టార్స్ ఉండాలి కదా అనే ప్రశ్న కూడా వేస్తున్నారు. ఇప్పుడు నెట్టింట ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ విషయానికి సంబంధించి కేవలం ఊహాగానాలు, అభిప్రాయాలు తప్పితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాబట్టి బీసీసీఐ అఫీషియల్స్, లేదా టీమిండియా మెంబర్స్ ఎవరైనా ఈ 3 స్టార్స్ కి సంబంధించి స్పందించాలేమో చూడాలి. అప్పటి వరకు ఈ చర్చకు తెరపడే అవకాశం అయితే కనిపించడం లేదు. మరి.. భారత వన్డే జెర్సీపై 3 స్రాట్స్ ఎందుకు ఉన్నాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.