Tirupathi Rao
IND vs SL First ODI- Arshdeep Singh Did Big Mistake: శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా తడబడింది. 230 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించలేక ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ స్కోర్లు టై అయ్యాక అర్షదీప్ చేసిన పనికి.. గెలవాల్సిన మ్యాచ్ టైగా మారిపోయింది. ఇప్పుడు అర్షదీప్ సింగ్ అందరికీ విలన్ అయిపోయాడు.
IND vs SL First ODI- Arshdeep Singh Did Big Mistake: శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా తడబడింది. 230 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించలేక ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ స్కోర్లు టై అయ్యాక అర్షదీప్ చేసిన పనికి.. గెలవాల్సిన మ్యాచ్ టైగా మారిపోయింది. ఇప్పుడు అర్షదీప్ సింగ్ అందరికీ విలన్ అయిపోయాడు.
Tirupathi Rao
శ్రీలంక టూర్ ఆఫ్ టీమిండియా 2024లో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి జోరు మీదున్న టీమిండియాకు వన్డే సిరీస్ లో మాత్రం షాక్ తప్పలేదు. తొలి వన్డేలో టీమిండియా 230 పరుగల అతి చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించడంలో తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మా.. మంచి స్టార్ట్ ని అందించినా కూడా ఆ మొమెంటమ్ ని తర్వాత కంటిన్యూ చేయలేకపోయారు. రోహిత్ శర్మ(58), అక్షర్ పటేల్(33), కేఎల్ రాహుల్(31) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దాదాపుగా అంతా త్వరగానే పెవిలియన్ కు చేరారు. అయితే అటూ ఇటూగా ఉన్న మ్యాచ్ మీద శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, సిరాజ్ ఆశల్ కల్పించారు. అయితే ఆ ఆశల మీద అర్షదీప్ సింగ్ నీళ్లు జల్లేశాడు. హీరో కావాలి అని చూసి చివరికి జీరో అయ్యాడు. ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ముందు పెద్ద విలన్ గా మారిపోయాడు.
తొలి వన్డే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా అద్ధుతమైన ప్రదర్శన చేసింది. శ్రీలంక బ్యాటర్లను కేవలం 230 పరుగులకే పరిమితం చేశారు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో మంచి స్టార్ట్ కూడా లభించింది. కానీ, మ్యాచ్ ని 9 వికెట్ల వరకు తీసుకెళ్లారు. ఆఖరికి స్కోర్లు సమం అయ్యే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయింది. 14 బంతుల్లో కేవలం 1 పరుగు చేస్తే విజయం వరిస్తుంది. అలాంటి సమయంలో శివమ్ దూబె(25) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కు అర్షదీప్ సింగ్ వచ్చాడు. అతనికి ఒక్క పరుగు చేసేందుకు రెండు బంతులు ఉన్నాయి. అది కాదు అంటే నెక్ట్స్ ఓవర్లో స్ట్రైకింగ్ సిరాజ్(5*)కు వెళ్తుంది. అతను ఆ ఒక్క పరుగు తీసి మ్యాచ్ గెలిపించే వాడు.
ఇవన్నీ కాదని.. అర్షదీప్ సింగ్ హీరో అవ్వాలి అనుకున్నాడు. అసలంక వేసిన డెలివిరీని సిక్సర్ గా మలిచి టీమిండియాకి మర్చిపోలేని విజయాన్ని అందిచాలి అనుకున్నాడు. కానీ, ఆ బంతి బ్యాటుకు తగలకుండా అతని బాడీకి తగిలింది. ఆ తర్వాత ఎల్బీడబ్ల్యూగా అర్షదీప్ సింగ్ పెవిలియన్ చేరాడు. బాల్ ని టచ్ చేసి సింగిల్ తిరిగినా కూడా అర్షదీప్ హీరోనే అయ్యేవాడు. ఇలా సిక్సర్ కొట్టి హీరో అవ్వాలి అనుకుని చివరకు అందరి దృష్టిలో విలన్ గా మారిపోయాడు. అప్పటి వరకు టీమ్ మొత్తం చేసిన పోరాటం అతని అత్యుత్సాహం వల్ల బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.
ఇప్పటికే నెట్టింట అర్షదీప్ సింగ్ పై ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నిజంగా అతని నుంచి ఇలాంటి ఒక పనిని ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఆ స్కోర్ ని ఛేదించే క్రమంలో స్కోరును సమయం చేసిన టీమిండియా ఒక్క పరుగు చేయకుండా ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ కాస్తా టైగా ముగిసింది. అర్షదీప్ సింగ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.