Somesekhar
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొటి టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొడుతూ.. తొలి ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ. మరి కోహ్లీ నెలకొల్పిన ఆ రికార్డు ఏంటి? ఇప్పడు చూద్దాం.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొటి టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొడుతూ.. తొలి ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ. మరి కోహ్లీ నెలకొల్పిన ఆ రికార్డు ఏంటి? ఇప్పడు చూద్దాం.
Somesekhar
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఒక్క కేఎల్ రాహుల్ తప్పితే మరే ఇతర ప్లేయర్లు రాణించలేదు. దీంతో తొలిరోజు ఆటముగిసే సరికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆటకు వర్షం అడ్డంకిగా మారడంతో.. మ్యాచ్ ను ముందుగానే ముగించాల్సి వచ్చింది. కాగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వెంట వెంటనే 3 వికెట్లు కోల్పోయిన టైమ్ లో క్రీజ్ లోకి వచ్చి.. 38 పరుగులు చేశాడు విరాట్. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొడుతూ.. తొలి ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. మరి కోహ్లీ నెలకొల్పిన ఆ రికార్డు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 64 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. తక్కువ వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను శ్రేయస్ అయ్యర్(31)తో కలిసి ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొడుతూ.. చరిత్ర సృష్టించాడు కింగ్ కోహ్లీ. విరాట్ సాధించిన రికార్డు వివరాల్లోకి వెళితే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా తొలి ప్లేయర్ గా విరాట్ నిలిచాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 57 ఇన్నింగ్స్ ల్లో 2101 పరుగులు చేశాడు. అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా సారథి రోహిత్ పేరిట ఉండేది. రోహిత్ 42 ఇన్నింగ్స్ ల్లో 2097 పరుగులు చేశాడు. ఇక ఈ లిస్ట్ లో రోహిత్ తర్వాత టీమిండియా వెటరన్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా(1769) పరుగులతో ఉన్నాడు. కాగా.. ఈ రికార్డుతో పాటుగా మరో ఘనత కూడా సాధించాడు విరాట్. సౌతాఫ్రికాతో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ప్లేయర్ గా విరాట్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దం ఈ ఫీట్ ను సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(1252)ను అధిగమించాడు. మరి విరాట్ సాధించిన ఈ అరుదైన ఘనతలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.