ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ ప్రారంభం అయ్యింది. చిరకాల ప్రత్యర్థులు అయిన ఇండియా-పాక్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్ లకు దూరం అయిన శుబ్ మన్ గిల్ బరిలోకి దిగాడు. ఇక ఈ మ్యాచ్ తొలి ఓవర్ లోనే రికార్డులు బద్దలు కొట్టింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు అన్ని ఒకెత్తు.. ఈరోజు(అక్టోబర్ 14)న జరిగే ఇండియా-పాక్ మ్యాచ్ ఒకెత్తు. యావత్ ప్రపంచం మెుత్తం ఈ మ్యాచ్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోంది. తాజాగా ప్రారంభం అయిన ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ లోనే ఓ రికార్డు బ్రేక్ అయ్యింది. టీమిండియా-పాక్ మ్యాచ్ తొలి ఓవర్ ను రికార్డు స్థాయిలో కోటిన్నర మంది హాట్ స్టార్ లో చూశారు. ఓటీటీ చరిత్రలో తొలి ఓవర్ ను ఇంతమంది చూడటం ఇదే మెుదటిసారి. దీన్ని బట్టే తెలుస్తోంది ఇండియా-పాక్ మ్యాచ్ రేంజ్ ఏంటో. ఇక వ్యూయర్ షిప్ ఇలాగే కొనసాగితే.. ఈ మ్యాచ్ ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు క్రీడా పండితులు.
ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు అద్భుతమైన ఆరంభమేమీ లభించలేదు. భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ వేస్తున్నప్పటికీ వికెట్లు మాత్రం తీయలేకపోయారు. 8వ ఓవర్ లో గానీ టీమిండియా బౌలర్లు వికెట్ సాధించారు. పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫిక్(20) వికెట్ తీసి భారత్ కు బ్రేక్ త్రూ ఇచ్చాడు సిరాజ్. ప్రస్తుతం పాక్ ఇన్నింగ్స్ నిలకడగా సాగుతోంది. 11 ఓవర్లకు వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది పాక్. క్రీజ్ లో బాబర్(14), ఇమామ్ ఉల్ హక్(25) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
1.5cr concurrent viewership in the first over itself on Hotstar!
– Records will be broken today. pic.twitter.com/c8v1W0s7Tq
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2023