iDreamPost
android-app
ios-app

క్రికెట్ ఫ్యాన్స్ కు అలర్ట్.. రాత్రి 8 గంటలకు టికెట్లు విడుదల

  • Published Oct 11, 2023 | 7:32 PM Updated Updated Oct 11, 2023 | 7:32 PM
  • Published Oct 11, 2023 | 7:32 PMUpdated Oct 11, 2023 | 7:32 PM
క్రికెట్ ఫ్యాన్స్ కు అలర్ట్.. రాత్రి 8 గంటలకు టికెట్లు విడుదల

వన్డే వరల్డ్ కప్ 2023 సంగ్రామం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రధాన జట్ల మధ్య లీగ్ మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. కాగా ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్ ను ఆసిస్ తో ఆడి విజయభేరీ మోగించిన విషయం తెలిసిందే. తాజాగా నేడు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 272 పరుగులు చేసింది. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వికెట్ నష్టపోకుండా 64 పరుగులతో భారత్ ఆటను కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది బీసీసీఐ. భారత్ తదుపరి ఆడబోయే మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను ఈ రోజు రాత్రి 8 గంటలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

కాగా ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో ఈ నెల 14, 19 తేదీల్లో భారత్ తలపడనున్నది. కాగా మ్యాచ్ లకు సంబంధించిన టికెట్ల విషయంలో బీసీసీఐ కీలక అప్ డేట్ ఇచ్చింది. అహ్మదాబాద్, పూణేలో జరుగనున్న మ్యాచ్ ల టికెట్లు ఈ రోజు రాత్రి 8 గంటలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఇప్పటికే అహ్మదాబాద్ లో పాకిస్తాన్ తో జరుగనున్న మ్యాచ్ టికెట్లను కొన్నింటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టికెట్ల కోసం అధికారిక వెబ్ సైట్ tickets.cricketworldcup.com ను సంప్రదించాలని బీసీసీఐ కోరింది.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş