iDreamPost
android-app
ios-app

IND vs ENG: వీడియో: బుమ్రాపై అంపైర్ కు ఓలీ పోప్ ఫిర్యాదు.. ఇంతకీ ఏం చేశాడంటే?

  • Published Jan 28, 2024 | 6:15 PM Updated Updated Jan 28, 2024 | 6:15 PM

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో జస్ప్రీత్ బుమ్రాపై అంపైర్ కు ఫిర్యాదు చేశాడు సెంచరీ హీరో ఓలీ పోప్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో జస్ప్రీత్ బుమ్రాపై అంపైర్ కు ఫిర్యాదు చేశాడు సెంచరీ హీరో ఓలీ పోప్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

  • Published Jan 28, 2024 | 6:15 PMUpdated Jan 28, 2024 | 6:15 PM
IND vs ENG: వీడియో: బుమ్రాపై అంపైర్ కు ఓలీ పోప్ ఫిర్యాదు.. ఇంతకీ ఏం చేశాడంటే?

ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా 28 పరుగులతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ డెబ్యూ బౌలర్ టామ్ హార్ట్లీ అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను లాగేసుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సమయం నుంచి హార్ట్లీ దెబ్బ మీద దెబ్బ కొడుతూ.. వచ్చాడు. రెండో ఇన్సింగ్స్ లో అతడు ఇప్పటికే 7 వికెట్లు తీశాడు. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో జస్ప్రీత్ బుమ్రాపై అంపైర్ కు ఫిర్యాదు చేశాడు సెంచరీ హీరో ఓలీ పోప్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ బుమ్రా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.

ఓలీ పోప్.. తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ హీరో. అద్భుతమైన భారీ శతకంతో ఇంగ్లాండ్ కు మంచి ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. తన మారథాన్ ఇన్నింగ్స్ లో 278 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లతో 196 రన్స్ చేసి, డబుల్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో పోప్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే? ఇన్నింగ్స్ 81వ ఓవర్ వేయడానికి వచ్చాడు బుమ్రా.

pope compalint on bumrah

ఈ క్రమంలో అప్పటికే 156 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు పోప్. ఇక ఈ ఓవర్ 4వ బంతి పోప్ ప్యాడ్స్ కు తాకగా.. రన్ తీశాడు. రన్ తీసే క్రమంలో బుమ్రా అతడికి ఎదురుగానే నిలబడ్డాడు. నిజం చెప్పాలంటే బుమ్రా కావాలనే తన భుజాన్ని పోప్ వైపు జరిపాడు. దీంతో ఇద్దరూ ఢీ కొన్నారు. ఇక ఈ విషయంపై పోప్ అంపైర్ కు ఫిర్యాదు చేశాడు. కాగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ ఇందులో కలగజేసుకుని పోప్ కు నచ్చజెప్పాడు. అయినా వినకుండా ఇంగ్లాండ్ బ్యాటర్ మరోసారి అంపైర్ తో మాట్లాడాడు. అప్పటికే బుమ్రా తన రెండు చేతులు పైకెత్తి సారీ చెప్పినట్లు చేశాడు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet giriş