Tirupathi Rao
వరల్డ్ కప్ 2023 చివరి అంఖానికి చేరుకుంది. వరల్డ్ కప్పుని ముద్దాడేందుకు భారత్ అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఆస్ట్రేలియా కెప్టెన్ కొన్ని దురుసు వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ కప్ 2023 చివరి అంఖానికి చేరుకుంది. వరల్డ్ కప్పుని ముద్దాడేందుకు భారత్ అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఆస్ట్రేలియా కెప్టెన్ కొన్ని దురుసు వ్యాఖ్యలు చేశాడు.
Tirupathi Rao
వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడేందుకు భారత్ ఒక్క అడుగు దూరంలో ఉంది. ఏది ఏమైనా ఈసారి కప్పు కొట్టాల్సిందే అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. టీమిండియా కూడా 2003నాటి వైఫల్యానికి సంబంధించి.. ఆస్ట్రేలియాను దెబ్బ ప్రతీకారం తీర్చుకోవాలి అని భావిస్తోంది. ఇక్కడ ఇంకో యాధృచ్ఛికం ఏంటంటే.. 2003 ఫైనల్లో ఆస్ట్రేలియా 10 మ్యాచుల్లో గెలియి ఫైనల్ చేరింది. అప్పుడు టీమిండియా 8 మ్యాచుల్లో గెలిచి ఫైనల్ చేరింది. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ 2023లో టీమిండియా 10 మ్యాచుల్లో గెలిచి ఫైనల్ చేరితే.. ఆస్ట్రేలియా 8 మ్యాచుల్లో గెలిచి తుదిపోరుకు చేరుకుంది. ఆ సెంటిమెంట్ పరంగా కూడా ఇప్పుడు టీమిండియా విజయం సాధిస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పొగరబోతు మాటలు అన్నాడు.
స్లెడ్జింగ్ అనే పదం ఆస్ట్రేలియా జట్టుకు మారుపేరులా మారింది. ఎందుకంటే ఆసీస్ జట్టు ఎప్పుడూ ప్రత్యర్థులను మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మైదానంలో ఉన్న అభిమానులను కూడా రెచ్చగొడుతూ ఉంటుంది. సాధారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే టీమిండియా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వస్తుంది. కంగారూలను భారత్ కంగారు పెట్టాలి అని కోరుకుంటూ ఉంటారు. మాములుగా ఉంటేనే భారత్ ఫ్యాన్స్ కు ఇంతలా ఉంటే.. ఇప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కొన్ని మాటలు అని ఆ పరిస్థితిని మరింత దారుణంగా మార్చుకున్నాడు. టీమిండియా ఫ్యాన్స్ నోర్లు మూయిస్తాం అంటూ రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ కూడా చేశాడు.
మ్యాచ్ కు సంబంధించి నిర్వహించిన ఇంటరాక్షన్ లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా హోమ్ గ్రౌండ్ అంటే.. ఆడియన్స్ నుంచి కూడా భారత్ కే కాస్త ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కదా అని అడిగారు. అందుకు కమిన్స్ మాట్లాడుతూ.. “క్రౌడ్ కచ్చితంగా వన్ సైడెడ్ గానే ఉంటుంది. కానీ క్రీడల్లో అంత పెద్ద క్రౌడ్ సైలెంట్ గా ఉండటం కంటే కూడా ఏదీ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వదు” అంటూ కామెంట్ చేశాడు. అంటే టీమిండియా ఫ్యాన్స్ నోర్లు మూయిస్తాం అంటూ కమిన్స్ అహంకారపు కామెంట్స్ చేశాడు. నిజానికి ఆస్ట్రేలియాకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. కీలక మ్యాచుల్లో ఇలాంటి ప్రవర్తనతోనే అందరినీ రెచ్చగొడుతూ ఉంటారు.
ఇంక ఈ మ్యాచ్ లో ముగింపు వేడుకలు కూడా ఎంతో ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ చాలా భారీ ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సూర్యకిరణ్ IAF ఎయిర్ షో ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ లో ఆధిత్య గాధ్వీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇన్నింగ్స్ బ్రేక్ లో ప్రీతమ్ చక్రవర్తి, జోనితా గాంధీ, నకాశ్ అజీజ్, అమిత్ మిశ్రా, తుషర్ జోషీ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఇంక సెకండ్ డ్రింక్స్ బ్రేక్ లో లేజర్ లైట్ షో ఉంటుందని బీసీసీఐ ప్రకటించింది. అంటే మొత్తానికి గేమ్ పరంగానే కాకుండా.. ఎంటర్ టైన్మెంట్ పరంగా కూడా ఈ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ అందరికీ గుర్తుండిపోతాయి. మరి.. ఇండియన్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.