IND vs AFG- Rohit Sharma Century: రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. సూపర్ సెంచరీతో చెలరేగి..

Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. సూపర్ సెంచరీతో చెలరేగి..

బెంగళూరు వేదికగా రోహిత్ శర్మ, రింకూ సింగ్ నిప్పులు చెరిగారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా పరుగుల వరద పారించారు.

బెంగళూరు వేదికగా రోహిత్ శర్మ, రింకూ సింగ్ నిప్పులు చెరిగారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా పరుగుల వరద పారించారు.

ఆఫ్గనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా 2024 టీ20 సిరీస్లో భాగంగా బెంగళూరు వేదికగా మూడో టీ20 జరిగింది. ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ విశ్వరూపం దాల్చాడు. ఏ బౌలర్ ని వదిలిపెట్టకుండా బౌండరీలతో విజృంభిస్తున్నాడు. ఎక్కడా కూడా ఆఫ్గాన్ ప్లేయర్లకు అవకాశం లేకుండా మైదానం మొత్తం పరుగుల వరద పారించాడు. హిట్ మ్యాన్ ఫామ్ చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. రోహిత్ కు రింకూ సింగ్ తోడు కావడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ విశ్వరూపం దాల్చడమే కాకుండా.. శతకంతో చెలరేగాడు.

ఈ 3 టీ20ల సిరీస్ లో తొలి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు నమోదు చేసిన టీమిండియా ఇప్పటికే సిరీస్ ని కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ లో కూడా తప్పకుండా విజయం సాధిస్తారని ముందు నుంచి అంతా అనుకున్నారు. కానీ, టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత లెక్కలు తారుమారు అయ్యాయి. టాపార్డర్ మొత్తం వరుసగా పెవిలియన్ బాట పట్టింది. జైస్వాల్(4), విరాట్ కోహ్లీ(0), శివమ్ దూబే(1), సంజూ శాంసన్(0) అవుట్ కావడంతో టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. కానీ, రోహిత్ శర్మ మాత్రం తన బ్యాటుకు పని చెప్పాడు. ఎక్కడా కూడా ఆఫ్గాన్ బౌలర్లకు ఆస్కారం లేకుండా పరుగుల వరద పారించాడు.

రింకూ సింగ్ తో కలిసి రోహిత్ శర్మ వంద పరుగుల భాగస్వామ్యాన్ని దాటించడమే కాకుండా.. వ్యక్తిగత స్కోరును కూడా వంద దాటించేశాడు. సిక్సులు, ఫోర్లతో మైదానంలో తాండవం చేశాడు. రింకూ సింగ్ కూడా రోహిత్ కు మద్దతుగా నిలవడంతో 150 పరుగులు కూడా చేయరేమో అనుకునే పరిస్థితి నుంచి స్కోరు బోర్డును రెండు వందలు దాటించేశారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటిగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఏ బౌలర్ నీ వదిలిపెట్టలేదు. గ్రౌండ్ లో ఏ ప్లేస్ ని వదిలిపెట్టలేదు. ఆఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 69 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

రోహిత్ కు రింకూ సింగ్ కూడా తోడయ్యాడు. బౌలర్లపై రింకూ సింగ్ కూడా విరుచుకుపడ్డాడు. రింకూ సింగ్ కేవలం 39 బంతుల్లోనే 6 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేశాడు. వీళ్లిద్దరు విజృంభించడంతో టీమిండియా స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212కు చేరింది. ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ చూస్తే.. ఫరీద్ అహ్మద్ మాలిక్ కు 3 వికెట్లు దక్కాయి. ఓమ్రాజై ఒక వికెట్ దక్కించుకున్నాడు. కరీమ్ జనాత్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీసుకోకపోగా 3 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తానికి 150 అయినా చేయగలరా అనుకుంటున్న తరుణంలో ఆఫ్గనిస్తాన్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. మరి.. రోహిత్ శర్మ సూపర్ సెంచరీ, రింకూ సింగ్ తూఫాన్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments