IPL Auction: IPL 2025 వేలంలోకి వస్తే ఆ ప్లేయర్ కు రూ. 30 కోట్లు పక్కా: IPL ఆక్షనీర్

విరాట్ కోహ్లీ గురించి ఐపీఎల్ 2025 వేలం నిర్వహకుడు హ్యూ ఎడ్మిడెస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

విరాట్ కోహ్లీ గురించి ఐపీఎల్ 2025 వేలం నిర్వహకుడు హ్యూ ఎడ్మిడెస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

ఐపీఎల్ 2025.. నిర్వహణ కోసం ఇప్పటి నుంచే బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వేలంలో అనుసరించాల్సిన నిబంధలు, వాటిల్లో ఏమైనా మార్పులు చేయాలా? అని ఫ్రాంచైజీలతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఫ్రాంచైజీలు సైతం తమ అభిప్రాయాలను, సూచనలను బీసీసీఐ ముందు ఉంచారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2025 వేలం నిర్వహకుడు హ్యూ ఎడ్మిడెస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తే.. రూ. 30 కోట్లు పలుకుతాడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

విరాట్ కోహ్లీ.. ఫార్మాట్ ఏదైనా బ్యాట్ తో చెలరేగడం అలవాటు. ఇక ఐపీఎల్ అంటే చాలు.. పూనకం వచ్చిన రేంజ్ లో పరుగుల వరదపారిస్తుంటాడు. గత ఐపీఎల్ లో పరుగుల సునామీ సృష్టించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. కానీ తన జట్టుకు మాత్రం ఐపీఎల్ టైటిల్ ను మాత్రం అందించడంలో సక్సెస్ కాలేకపోతున్నాడు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ టీమ్ నుంచి వేరే టీమ్ కు మారాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మిడెస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. “ఐపీఎల్ వేలంలోకి గనక విరాట్ కోహ్లీ వస్తే.. కచ్చితంగా రూ. 30 కోట్లు పలుకుతాడు” అని చెప్పుకొచ్చాడు ఎడ్మిడెస్.

కాగా.. ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నాడు. ఆ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. పరుగుల వరదపారిస్తున్నప్పటికీ.. టైటిల్ ను మాత్రం అందించలేకపోతున్నాడు. మిగతా ఆటగాళ్ల నుంచి సపోర్ట్ లభించకపోవడంతో కోహ్లీపై ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది. గడిచిన ఐపీఎల్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయిన విషయం తెలియనిది కాదు. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. మరి కోహ్లీ ఆక్షన్ లోకి వస్తే.. రూ. 30 కోట్లు పలుకుతాడు అన్న వేలం నిర్వాహకుడి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments