టీమిండియా లేకుండానే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025? శ్రీలంకకు బంపరాఫర్‌?

Champions Trophy 2025, BCCI, PCB, Team India, Sri Lanka: భారత జట్టు లేకుండానే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే శ్రీలంకకు లక్కీ ఛాన్స్‌ దక్కుతుంది. భారత్‌ లేకుండా ఛాంపియన్స్‌ ట్రోఫీ అనే విషయం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Champions Trophy 2025, BCCI, PCB, Team India, Sri Lanka: భారత జట్టు లేకుండానే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే శ్రీలంకకు లక్కీ ఛాన్స్‌ దక్కుతుంది. భారత్‌ లేకుండా ఛాంపియన్స్‌ ట్రోఫీ అనే విషయం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా గురించి ఇండియాలో కంటే పాకిస్థాన్‌లోనే ఎక్కువ చర్చ జరుగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో భారత జట్టు పాకిస్థాన్‌ రావాలని ఆ దేశ క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ, బీసీసీఐ మాత్రం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో.. క్రికెట్‌ అభిమానులకు షాకిస్తూ.. ఒక కొత్త వార్త వైరల్‌ అవుతోంది. అదేంటంటే.. భారత జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు రాకుంటే.. టీమిండియా ప్లేస్‌లో శ్రీలంకను ఆడించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సంచలన విషయం బయటికి వచ్చింది. పాకిస్థాన్‌ ఇటీవల ప్రకటించిన డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌లో శ్రీలంక జట్టు లేదు. టాప్‌ 8 టీమ్స్‌ మాత్రమే ఛాంపియన్స్‌ ట్రోఫీలో పోటీ పడనున్నాయి.

అయితే.. సెక్యూరిటీ కారణాల వల్ల భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో అంటే.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌ లేదు శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీని కోరినట్లు కూడా సమాచారం. కానీ, మరోవైపు పాకిస్థాన్‌ మాత్రం టీమిండియా కచ్చితంగా ఇండియాలో పర్యటించాల్సిందే అని గట్టి పట్టుబట్టి కూర్చుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ససేమీరా అంటోంది. అవసరం అయితే.. ఇండియా లేకుండానైనా ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహిస్తామని అంటోంది.

టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా లేకుంటే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే.. శ్రీలంకకు బంపరాఫర్‌ అన్నట్లే. టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి తప్పుకుంటే.. శ్రీలంక ఆ టోర్నీకి అర్హత సాధించనుంది. అలా ఆడేందుకు లంక కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై బీసీసీఐ నిర్ణయం గురించి శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీసీసీఐని కాదని, టీమిండియా లేకుండానే ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించే సహసం ఐసీసీ చేస్తుందా? అంటే కష్టమే. ధనికి క్రికెట్‌ బోర్డుగా ఐసీసీపై కూడా బీసీసీఐకి గట్టి పట్టు ఉంది. పైగా ఆర్థికంగా మంచి లాభాలు రావాలన్న ఇండియా ఉంటేనే ఈ ఐసీసీ టోర్నీ అయిన సక్సెస్‌ అయ్యేది. మరి ఈ విషయంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments