SNP
IND vs SA, T20 World Cup 2024, Final: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కానీ, మ్యాచ్ వర్ష గండం ఉంది. ఒక వేళ మ్యాచ్ రద్దు అయితే విజేతగా ఎవర్ని ప్రకటిస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
IND vs SA, T20 World Cup 2024, Final: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కానీ, మ్యాచ్ వర్ష గండం ఉంది. ఒక వేళ మ్యాచ్ రద్దు అయితే విజేతగా ఎవర్ని ప్రకటిస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024 తుది దశకు చేరుకుంది. నేడు(శనివారం) జరిగే ఫైనల్‌తో ఈ మెగా టోర్నీ విజేత ఎవరో తేలనుంది. ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం బార్బడోస్ వేదికగా ఇండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. ఎలాగైన సరే కప్పు కొట్టాలని రెండు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియానే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కోహ్లీ ఒక్కడు ఫైనల్‌లో ఫామ్‌లోకి వస్తే.. టీమిండియా ఖాతాలో రెండు టీ20 వరల్డ్ కప్ వచ్చి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, ఫైనల్ మ్యాచ్‌కు వర్ష గండం పొంచి ఉందని వాతావరణ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. ఎవర్ని విజేతగా ప్రకటిస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ టోర్నీలో సౌతాఫ్రికా వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు దూసుకొచ్చింది. టీమిండియా కూడా ఓటమి ఎరుగని జట్టుగానే ఫైనల్‌కి వచ్చినా.. 7 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించింది. లీగ్ స్టేజ్‌లో కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో టీమిండియా ఒక మ్యాచ్‌ను మిస్ చేసుకుంది. టీమిండియా, సౌతాఫ్రికా ఓటమి ఎరుగని జట్లుగా ఫైనల్‌కు చేరినా.. సౌతాఫ్రికా ఒక విజయం ఎక్కువ సాధించింది. అయితే.. ఈ విజయాలతో విజేతను డిసైడ్ చేయరు. మరి ఎలా ప్రకటిస్తారో ఇప్పుడు చూద్దాం..
మ్యాచ్ శనివారం అంటే జూన్ 29న బార్బడోస్ వేదికగా జరగనుంది. మ్యాచ్ సరిగే సమయంలో 20 నుంచి 47 శాతం వరకు అక్కడ వర్షం వచ్చే సూచనలు ఉన్నట్లు ఆక్యువెదర్ పేర్కొంది. ఒక వేళ వర్షం మ్యాచ్ ఆలస్యం అయితే.. అదనంగా 190 నిమిషాల సమయం కేటాయించారు. అప్పటికీ మ్యాచ్ జరగకపోతే.. ఫైనల్ కోసం రిజర్వ్ డేను కేటాయించారు. అంటే ఆదివారం జూన్ 30న మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక వేళ శనివారం మ్యాచ్ కొద్ది సేపు జరిగి మళ్లీ తిరిగి ప్రారంభం కాకపోతే.. నెక్ట్స్ అక్కడి నుంచే మ్యాచ్‌ను మొదలుపెడతారు. అలా కాకుండా శనివారం ఇరు జట్లు కనీసం పదేసి ఓవర్లు మ్యాచ్ ఆడిన తర్వాత వర్షం వల్లే మ్యాచ్ పూర్తిగా ఆగిపోతే డక్ వర్త్ లూయిస్ ప్రకారం విజేతను ప్రకటిస్తారు. అలా ప్రకటించాలంటే ఇరు జట్లు కనీసం 10, 10 ఓవర్లు ఆడి ఉండాలి. ఇక రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ అస్సలు జరగకపోతే.. ఇండియా, సౌతాఫ్రికా జట్లను సంయుక్త విజేతలు ప్రకటిస్తారు. ఇరు జట్ల కెప్టెన్ కలిసి కప్పును అందుకుంటారు. టీ20 వరల్డ్ కప్ 2024కు ఇండియా, సౌతాఫ్రికా ఉమ్మడి విజేతగా నిలుస్తాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి
The unstoppable forces meet 🇿🇦🇮🇳
Aiden Markram 🆚 Rohit Sharma – who will lift the #T20WorldCup trophy? 🤔 pic.twitter.com/Fa7eoGg8wz
— T20 World Cup (@T20WorldCup) June 28, 2024