Dharani
అహ్మదాబాద్ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో విన్నర్‌కు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనే దాని గురించి జోరుగా చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు..
అహ్మదాబాద్ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో విన్నర్‌కు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనే దాని గురించి జోరుగా చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు..
Dharani
దాదాపు 45 రోజులపాటు జరిగిన ప్రపంచకప్ పోరు తుది అంకానికి చేరుంది. నేడు అనగా నవంబర్ 19 ఆదివారం.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది సమరంలో భారత్-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేస్తోన్న భారత్.. 11 ఓవర్లు ముగిసే సరిగి 3 వికెట్ల నష్టపోయి 81 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(47), శుబ్‌మన్ గిల్(4), శ్రేయాస్ అయ్యర్(4) పరుగులకే ఔటయ్యారు. మరి కొన్ని గంటల్లో విశ్వ విజేత ఎవరో తేలనుంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ విన్నర్‌కు ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉదయించింది. దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ ముందుగానే విడుదల చేసింది. మరి వరల్డ్‌కప్ విజేతకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారంటే..
ఐసీసీ తెలిపిన వివరాల ప్రకారం.. వరల్డ్ కప్ విజేతకు 40 లక్షల డాలర్లు (రూ.33.31 కోట్లు) ప్రైజ్ మనీగా అందజేయనున్నారు. రన్నరప్‌కు 2 మిలియన్ డాలర్లు (రూ.16.65 కోట్లు) దక్కనున్నాయి. కాగా ఈ టోర్నమెంట్ మొత్తం ప్రైజుమనీ 10 మిలియన్ డాలర్లు (రూ.83.29 కోట్లు).
అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌ని 1.30 లక్షల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మ్యాచ్ చూడటం కోసం వచ్చారు. ఇక మ్యాచ్‌కు ముందు మధ్యాహ్నం 01:35-01:50 మధ్య సూర్యకిరణ్ యుద్ధ విమానాలతో ఐఏఎఫ్ ఎయిర్‌షో నిర్వహించింది.
ఫస్ట్ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆదిత్య గాధ్వీ ప్రదర్శన ఉంటుంది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ప్రీతమ్ చక్రబర్తి, జొనితా గాంధీ, నకష్ అజీజ్, అమిత్ మిశ్రా, ఆకాస సింగ్, తుషార్ జోషి షో ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో లేజర్, లైట్ షో ఉంటుంది. ఇక ఈ టోర్నీలో ఆస్ట్రేలియా 10 మ్యచ్‌ల్లో 8 విజయాలను అందుకోగా.. భారత్ మాత్రం అజేయంగా 10 మ్యాచ్‌లను గెలిచింది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఏకంగా 711 పరుగులు చేయగా.. మహమ్మద్ షమీ 23 వికెట్లతో టాపర్లుగా నిలిచారు.