ఆ ఒక్కటి పక్కనపెట్టి.. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ చోటు కొట్టేశా: సంజు శాంసన్‌

Sanju Samson, T20 World Cup 2024: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సంజు శాంసన్‌ తాజాగా ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కంచుకోవడం కోసం తాను చేసిన పనేంటో వివరించాడు. అదేంటో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. అదేంటో తెలుసుకోండి..

Sanju Samson, T20 World Cup 2024: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సంజు శాంసన్‌ తాజాగా ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కంచుకోవడం కోసం తాను చేసిన పనేంటో వివరించాడు. అదేంటో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. అదేంటో తెలుసుకోండి..

ఐపీఎల్‌ బిజీలో పడిపోయి.. టీ20 వరల్డ్‌ కప్‌ ఎంపికను ఎవరు అంత సీరియస్‌గా తీసుకున్నట్లు లేరు. మహా అయితే.. ఓ రెండు రోజులు మాత్రమే వరల్డ్‌ కప్‌ టీమ్‌ గురించి మాట్లాడుకున్నారు. రింకూ సింగ్‌ లాంటి ప్లేయర్లకు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కనందుకు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఏఏ ఆటగాళ్లు ఉన్నారో కూడా చాలా మంది క్రికెట్‌ అభిమానులకు టక్కున గుర్తురాదు. మరి కొంతమందికి అయితే ఎవరున్నారో కూడా తెలియదు. ఎందుకంటే అంతా ఐపీఎల్‌ మాయలో ఉన్నారు. అయితే.. అందరు కోరుకున్నట్లుగా టీమిండియా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న క్రికెటర్‌ ఒకడున్నాడు అతనే సంజూ శాంసన్‌. ఈ స్టార్‌ క్రికెటర్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా ఫస్ట్‌ ఛాయిస్‌గా టీమ్‌కి సెలెక్ట్‌ అయ్యాడు.

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో సంజు శాంసన్‌ను సెలెక్ట్‌ చేయకపోవడంపై పెద్ద రచ్చ జరిగింది. వన్డేల్లో ఇరగదీస్తున్న సంజును కాదని, వన్డేల్లో పెద్దగా రాణించని సూర్యకుమార్‌ యాదవ్‌ను వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి ఎలా తీసుకుంటారంటూ.. సెలెక్టర్లపై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. వారు ఊహించనట్లుగానే సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డే వరల్డ్‌ కప్‌ దారుణంగా విఫలం అయ్యారు. ముఖ్యంగా ఫైనల్‌ తన అవసరం ఉన్న సమయంలో కూడా సూర్య చేతులెత్తేశాడు. ఒక టీ20 ప్లేయర్‌ను నమ్మి టీమిండియా చేతులు కాల్చుకుందని అంతా విమర్శించారు. అయితే.. ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం మాత్రం భారత సెలెక్టర్ల ఆ తప్పు చేయలేదు. రిషభ్‌ పంత్‌తో పాటు వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా శాంసన్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు.

అయితే.. వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక కావాలంటే తాను ఏదో గొప్పగా చేయాలని ఫిక్స్‌ అయిన సంజు శాంసన్‌.. దాని కోసం ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం టీమిండియాలో చోటు సంపాదించాలంటే.. ఐపీఎల్‌ 2024లో తనను తాను నిరూపించుకోవాలని బలంగా ఫిక్స్‌ అయిన సంజు.. అందుకోసం తన ఫోన్‌ను పూర్తిగా పక్కనపెట్టినట్లు వెల్లడించాడు. అది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన శాంసన్‌ 48.27 యావరేజ్‌, 153.47 స్ట్రైక్‌రేట్‌తో 531 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో చూపిన ఈ అద్భుత ప్రతిభ ఆధారంగా సంజుకు టీ20 వరల్డ్‌ కప్‌లో చోటు దక్కింది. ఒక్క ఫోన్‌ పక్కనపెడితే సంజు ఇంత బాగా ఆడతాడా? అంటూ క్రికెట్‌ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments