రోహిత్‌ శర్మ లాంటి కెప్టెన్‌ను చూడలేదు: భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌

Rohit Sharma, Vikram Rathour: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి.. మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ లాంటి కెప్టెన్‌ను చూడలేదని అన్నాడు. మరి ఆయన అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Vikram Rathour: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి.. మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ లాంటి కెప్టెన్‌ను చూడలేదని అన్నాడు. మరి ఆయన అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్నంత కాలం.. టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేసిన విక్రమ్‌ రాథోర్‌.. ద్రవిడ్‌తో పాటే ఆయన పదవీ కాలం కూడా ముగియడంతో భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ పదవికి వీడ్కోలు పలికారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత.. గుడ్‌బై చెప్పడంతో.. టీమిండియాతో తన కోచింగ్‌ జర్నీకి అద్భుతమైన ముగింపు ఇచ్చాడు. అయితే.. తాజాగా టీమిండియా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి.. విక్రమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పటి వరకు రోహిత్‌ శర్మ లాంటి కెప్టెన్‌ను చూడలేదంటూ పేర్కొన్నాడు. మరి ఆయన అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాటింగ్‌ కోచ్‌గా టీమిండియాలోని ఆటగాళ్లను, అలాగే కెప్టెన్‌ రోహిత్‌ శర్మను చాలా క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేసే అవకాశం విక్రమ్‌కు వచ్చింది. అందుకే.. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా టీమ్‌తో ఎలా ఉండేవాడో చెప్పే అర్హత ఆయనకు ఉంది. అందుకే.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతన్నాయి. ‘రోహిత్ శర్మ.. ప్లేయర్స్‌ కెప్టెన్, టీమ్‌లోని ఆటగాళ్లకు తన టైమ్‌ ఇస్తూ.. వారితో తరచూ మాట్లాడుతూ.. ఒక కెప్టెన్‌గా వారికి సపోర్ట్‌గా ఉంటాడు. టీమ్స్‌ మీటింగ్స్‌, స్ట్రాటజీ మీటింగ్స్‌లో ఎక్కువ పాల్గొంటాడు. కేవలం టీమ్‌ మీటింగ్స్‌ అనే కాదు.. బౌలర్ల, బ్యాటర్ల మీటింగ్‌లోనూ పాల్గొంటూ.. ఏం చేయాలనే విషయాలను చర్చిస్తూ ఉంటాడు. ఇలా టీమ్‌లోని ప్లేయర్లందరి కోసం ఇంతలా తాపత్రయపడుతూ.. తన టైమ్‌ను ఇన్వెస్ట్‌ చేసే కెప్టెన్‌ని నేను ఎప్పుడూ చూడలేదు’ అంటూ విక్రమ్‌ తెలిపారు.

రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడనే విషయాన్ని మనం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్‌ కోహ్లీ తర్వాత భారత జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ.. టీమ్‌ను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా.. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సెమీ ఫైనల్‌, డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌, వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఆడింది. అలాగే 2023లో ఆసియా కప్‌, 2024లో టీ20 వరల్డ్‌ కప్‌లు గెలిచింది టీమిండియా. ఇక ఇతర సిరీస్‌లు కూడా చాలానే దక్కించుకుంది. దీంతో.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. మరి రోహిత్‌ శర్మపై టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments