హైదరాబాద్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ట్రాఫిక్. కానీ హైదరాబాద్ ఫుడ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఒకే ఒక్కటి బిర్యానీ. వరల్డ్ కప్ 2023 మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్ కు మ్యాచ్ లు ప్రారంభం కాకముందే ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ వేదికగా వార్మప్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భాగ్యనగరం వచ్చిన పాక్-ఆసీస్ ఆటగాళ్లు హైదరాబాద్ వంటకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా పాక్ ప్లేయర్లు హైదరాబాదీ బిర్యానీకి ఫ్యాన్స్ అయిపోయారు. కరాచీ బిర్యానీ కంటే ఇక్కడి బిర్యానే బెటర్ అంటూ ప్రశంసలతో పాటు రేటింగ్ కూడా ఇచ్చారు.
వరల్డ్ కప్ లో భాగంగా వార్మప్ మ్యాచ్ కోసం ముందుగానే హైదరాబాద్ చేరుకుంది పాక్ జట్టు. అయితే ఎయిర్ పోర్ట్ నుంచే పాక్ కు అద్బుతమైన ఆతిథ్యం ఇచ్చింది ఇండియా. భారత్ ఇచ్చిన ఆతిథ్యానికి పాక్ ఆటగాళ్లు అబ్బుపడ్డారు. ఇక వీరికి ఫుడ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వండి వడ్డించారు. ఈ క్రమంలోనే హైదరాబాదీ బిర్యానీ రుచి చూసిన పాక్ ఆటగాళ్లకు మైండ్ పోయింది. ఇలాంటి బిర్యానీ కరాచీలో కూడా దొరకదని, కరాచీ బిర్యానీ కంటే ఇదే బెటర్ అని చెప్పుకొచ్చాడు పాక్ బౌలర్ హసన్ అలీ. ఇక మరో పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ ఏకంగా మన బిర్యానీకి మంత్రముగ్దుడయ్యాడు. హైదరాబాదీ బిర్యానీకి 10 మార్కులకు ఏకంగా 20 మార్కులు ఇచ్చాడు. దీన్ని బట్టే అర్దం చేసుకోవచ్చు. పాక్ ప్లేయర్లు మన బిర్యానీకి ఎంత పెద్ద ఫ్యాన్స్ గా మారారోనని. కాగా.. ఆసీస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సైతం హైదరాబాద్ అంటే తనకెంతో ప్రేమని, ఇక్కడ ఆడితే సొంత గడ్డపై ఆడినట్లు ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Hasan Ali rates Hyderabadi Biryani better than Karachi Biryani.
Haris Rauf rates Hyderabadi Biryani 20 out of 10. pic.twitter.com/3z3QqKsUhX
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2023