Tanmay Agarwal: హైదరాబాద్‌ కుర్రాడి ఊచకోత! క్రికెట్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ

Tanmay Agarwal: రంజీ క్రికెట్‌ చరిత్రలో హైదరాబాదీ కుర్రాడు కొత్త అధ్యాయం లిఖించాడు. కేవలం 160 బంతుల్లో ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ బాదేశాడు. దేశవాళి క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీ.

Tanmay Agarwal: రంజీ క్రికెట్‌ చరిత్రలో హైదరాబాదీ కుర్రాడు కొత్త అధ్యాయం లిఖించాడు. కేవలం 160 బంతుల్లో ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ బాదేశాడు. దేశవాళి క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీ.

క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా హైదరాబాద్‌ క్రికెటర్‌ చెలరేగిపోయాడు. అతని ఊచకోతకు సరికొత్త చరిత్ర నమోదైంది. కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్‌ సెంచరీ బాదేసి.. అత్యంత వేగంగా ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా హైదరబాద్‌ రంజీ ప్లేయర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 33 ఫోర్లు, 21 సిక్సులు ఉండటం విశేషం. హైదరాబాద్‌లోని నెక్స్‌జెన్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన్మయ్‌ ఈ విధ్వంసం సృష్టించాడు. కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న తన్మయ్‌.. మొత్తంగా 160 బంతుల్లో 201.87 స్ట్రైక్‌రేట్‌తో 33 ఫోర్లు, 21 సిక్సులతో 323 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, తొలి రోజు ఆటను ముగించారు. రెండో రోజు కూడా తన్మయ్‌ తన విధ్వంసం కొనసాగిస్తే.. మరిన్ని రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఉంది.

మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌తో తన్మయ్‌ అగర్వాల్‌ పేరు దేశవాళి క్రికెట్‌లో మారుమోగిపోతుంది. ఇదే ఆటను కొనసాగిస్తే.. త్వరలోనే టీమిండియాలో స్థానం దక్కించుకునే అవకాశం కూడా లేకపోలేదు. కాగా, ఈ మ్యాచ్‌లో తన్మయ్‌ అగర్వాల్‌తో పాటు మరో ఓపెనర్‌ రాహుల్‌ సింగ్‌ సైతం 105 బంతుల్లోనే 26 ఫోర్లు, 3 సిక్సులతో 185 పరుగులు చేసి అదరగొట్టాడు. అరుణాచల్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఈ హైదరాబాదీ ఓపెనర్లు కేవలం 48 ఓవర్లలోనే 500 మార్క్‌ దాటించారు. ఇది నిజంగా విధ్వంసమే.. టెస్ట్‌ ఫార్మాట్‌లో ఓవర్‌కు 10 రన్‌రేట్‌తో పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్‌ బౌలర్లలో మిలింద్‌, కార్తీకేయ మూడేసి వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. అలాగే త్యాగరాజన్‌ సైతం రెండు వికెట్లు తీసుకున్నాడు. సంకేత్‌, సాకేత్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్‌ ఓపెనర్లు.. అరుణాచల్‌ బౌలర్లపై ఫోర్లు సిక్సులతో విరుచుకుపడ్డారు. ఇద్దరు ఓపెనర్లు రెండు వైపుల నుంచి ఊచకోత కోయడంతో పాపం.. అరుణాచల్‌ బౌలర్ల ఏం చేయలేకపోయారు. వారి విధ్వంసంతో.. స్కోర్‌ బోర్డు బుల్లెట్‌ వేగంతో దూసుకెళ్లింది. మరి కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్‌ సెంచరీ చేసిన తన్మయ్‌ అగర్వాల్‌ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments