SNP
Hardik Pandya, Alimony, Natasha: అందరూ అనుకున్నట్లుగానే హార్ధిక్ పాండ్యా-నటాషా విడాకులు తీసుకున్నారు. తమ వివాహబంధానికి పుల్‌స్టాప్ పెట్టి ఎవరిదారి వారు చూసుకున్నారు. మరి భార్యగా నటాషా పాండ్యా నుంచి ఎంత భరణం పొందిందో ఇప్పుడు చూద్దాం..
Hardik Pandya, Alimony, Natasha: అందరూ అనుకున్నట్లుగానే హార్ధిక్ పాండ్యా-నటాషా విడాకులు తీసుకున్నారు. తమ వివాహబంధానికి పుల్‌స్టాప్ పెట్టి ఎవరిదారి వారు చూసుకున్నారు. మరి భార్యగా నటాషా పాండ్యా నుంచి ఎంత భరణం పొందిందో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో పెను మార్పు సంభవించింది. చాలా కాలంగా వస్తున్న విడాకుల పుకార్లను నిజం చేస్తూ.. గురువారం రాత్రి హార్ధిక్ పాండ్యా తన విడాకుల విషయంపై స్పష్టత ఇచ్చాడు. నటాషాతో తాను విడిపోతున్నట్లు.. పరస్పర అంగీకరంతోనే తాము తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు పేర్కొన్నాడు. తమ ఇద్దరికి కలిగిన సంతానం అగస్త్యను ఇకపై ఇద్దరం విడివిడిగానే చూసుకుంటాం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇలాంటి కఠిన సమయంలో తమకు కాస్త ప్రైవసీ కల్పించాలని కోరాడు.
అయితే.. విడాకులు తీసుకున్న తర్వాత నటాషా, హార్ధిక్ పాండ్యా నుంచి నగదు, ఆస్థుల రూపంలో భరణం కింద భారీగానే పొందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. అది ఎంత మొత్తంలో అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఇటు పాండ్యా కానీ, అటు నటాషా కానీ స్పందించలేదు. అయితే.. వీరిద్దరు విడిపోతున్నారనే అనే వార్తలు వచ్చిన సమయంలో మాత్రం భరణం విషయమై ఒక వార్త బాగా వైరల్ అయింది. క్రికెటర్‌గా, పలు ప్రొడెక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా భారీగా సంపాదించిన పాండ్యా నుంచి నటాషా భరణం కింద ఏకంగా 70 శాతం ఆస్తిని పొందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
హార్ధిక్ పాండ్యా తన మొత్తం ఆస్తిలో 70 శాతం వాటాను నటాషా పేరిట మార్చేసినట్లు, ఇక విడాకులపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అంటూ కొన్ని వారాల క్రితం నేషనల్ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. మొత్తం ఆస్తిలో 70 శాతం అంటే చాలా ఎక్కువని, పాపం పాండ్యా రోడ్డునపడ్డట్లే అంటూ చాలా మంది అతనిపై జాలి చూపించారు. ఆ వెంటనే లేదు లేదు.. పాండ్యా తాను సంపాదించిన ఆస్తి మొత్తం వాళ్ల అమ్మ పేరిటే ఉంచాడని.. పాండ్య పేరు మీద చాలా తక్కువ ఆస్తి ఉందనే, ఆస్తి విషయంలో పాండ్యా చాలా తెలివిగా ఆలోచించి.. అన్ని వాళ్ల అమ్మ పేరిటే కొనడం వల్ల నటాషాకు చాలా తక్కువ మొత్తంలోనే వెళ్తుందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఎంత వరకు వాస్తవమో తెలియరాలేదు. అయితే.. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోతే ఎలాంటి భరణం చెల్లించాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది న్యాయనిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.