Virat Kohli: వీడియో: విరాట్‌ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హర్షా భోగ్లే!

ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. విరాట్‌ కోహ్లీ అభిమానుల నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసలింతకీ ఆయన ఏం అన్నారు? కోహ్లీ ఫ్యాన్స్‌ ఎందుకు మండిపడుతున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. విరాట్‌ కోహ్లీ అభిమానుల నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసలింతకీ ఆయన ఏం అన్నారు? కోహ్లీ ఫ్యాన్స్‌ ఎందుకు మండిపడుతున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులున్న విషయం తెలిసిందే. కేవలం అతని ఆట చూసేందుకే స్టేడియానికి చాలా మంది వస్తుంటారు. ఇండియన్‌ క్రికెట్‌కే కాదు.. మొత్తం ప్రపంచ క్రికెట్‌కు ముఖచిత్రంగా ఉన్నాడు కోహ్లీ. అయితే తాజాగా కోహ్లీపై ప్రఖ్యాత కామెంటేటర్‌ హర్షా భోగ్లే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక కార్యక్రమంలో భోగ్లే మాట్లాడుతూ.. క్రికెట్‌ టాపిక్‌పై పలు విషయాలను ప్రస్తావించారు. అందులో భాగంగానే కోహ్లీని ఉదాహరణగా చూపుతూ ఆయన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. అసలు ఆయన ఏం చెప్పారు? వివాదం ఎందుకు రాజుకుంది? లాంటి విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఓ కార్యక్రమంలో పాల్గొన్న భోగ్లే మాట్లాడుతూ.. ‘కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి.. ఆటగాళ్లు అవుట్‌ అవ్వాల్సి ఉంటుంది. అందుకు కోహ్లీని చక్కటి ఉదాహరణగా తీసుకోవచ్చు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. టెస్టుల్లో కావావాలని అవుట్‌ కావాల్సిన అవసరం లేదు. కానీ, టీ20ల్లో ఓ 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన సమయంలో తన తర్వాత వచ్చే బ్యాటర్‌ 6 బంతుల్లో 20 పరుగుల చేయగల సమర్థుడు అయితే.. కోహ్లీ అవుట్‌ అవ్వాలి. కోహ్లీ మూడు ఫార్మాట్స్‌లోనూ అద్భుతమైన ప్లేయర్‌ అయినప్పటికీ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వికెట్‌ ఇచ్చేయాలి’ అని భోగ్లే చెప్పుకొచ్చాడు.

ఇదే ఇప్పుడు వివాదానికి కారణమై​ంది. ఎందుకుంటే.. కోహ్లీ వేగంగా ఆడలేడనే అర్థం వచ్చేలా భోగ్లే వ్యాఖ్యలు ఉన్నాయని కొంతమంది క్రికెట్‌ అభిమానులు భోగ్లేపై మండిపడుతున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ను అప్పుడే మర్చిపోయారా? అంటూ చురకలు అంటిస్తున్నారు. 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన సమయంలో కోహ్లీ ఆడిన తీరు గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ వివాదంపై స్పందించిన భోగ్లే.. తాను ఆ ఉద్దేశంతో చెప్పలేదని, తన పూర్తి వీడియో కాకుండా కట్‌ చేసి పోస్ట్‌ చేశారని, పూర్తి వీడియో ఇది అంటూ ఆయన మరో వీడియో షేర్‌ చేశారు. ఒక సుదీర్ఘ చర్చలో భాగంగా మాట్లాడే మాటలకు వెనుక ముందు కట్‌ చేసి పోస్ట్‌ తప్పుడు అర్థాలు వస్తాయంటూ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments