SNP
SNP
క్రికెట్‌లో బ్యాటర్ల భారీ షాట్లు, బౌలర్ల నిప్పులు చెరిగే బంతులతో పాటు కొన్నిసార్లు ఫీల్డర్ల కళ్లు చెదిరే విన్యాసాలు కూడా ఉంటాయి. దశాబ్దకాలంగా ఫీల్డింగ్ విషయంలో క్రికెటర్లు ఊహించని అద్భుతాలు చేస్తున్నారు. గతంలో కనీసం కనీవిని ఎరుగని రీతిలో క్యాచ్‌లు అందుకుంటూ వీళ్లసలు మనుషులా లేక మరింకేమైననా అని అనిపిస్తున్నారు. కొన్ని సార్లు వాళ్లు అందుకుంటున్న క్యాచ్‌లు నమ్మశక్యంగా లేవు. బుల్లెట్‌లా దూసుకెళ్తున్న బంతిని కళ్లు మూసి తెరిచేలోగా చిరుతల్లా దూకుతూ మెరుపువేగంతో క్యాచ్‌లు పట్టడం, దాదాపు సిక్స్ వెళ్లిపోయిన బంతిని చివరి నిమిషంలో పట్టుకుని గాల్లోకి ఎగరేసి మళ్లీ దాన్ని అందుకోవడం ఇప్పుడు దాదాపు క్రికెటర్లందరికీ అలవాటైపోతుంది. మొదట్లో ఇదో అద్భుత టెక్నిక్‌గా భావించారు. కానీ, ఇప్పుడు అందరూ పట్టేస్తున్నారు. ఈ క్యాచ్ కూడా దాదాపు అలాంటిదే అయినా.. కొస్త డిఫరెన్స్ ఉంది.
ది హండ్రెడ్ టోర్నీలో భాగంగా నార్తెర్న్ సూపర్ చార్జర్స్-వెల్ష్ ఫైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుత విన్యాసం చోటు చేసుకుంది. నార్తెర్న్ సూపర్ చార్జర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్లేయర్, ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఈ సూపర్ క్యాచ్‌కు కారణం అయ్యాడు. అతని అసాధారణ క్యాచ్‌కు ఫైర్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో బిత్తరపోయాడు. ఇలా కూడా క్యాచ్ పడుతారా? అనేలా ఫేస్‌లో షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. 100 బంతుల ఇన్నింగ్స్‌గా సాగే ది హండ్రడ్ లీగ్‌లో భాగంగా నార్తెర్న్ సూపర్ ఛార్జర్స్ బౌలర్ బ్రిడన్ కేర్స్ వేసిన 84వ బంతిని జానీ బెయిర్ స్టో భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఉన్న హ్యారీ బ్రూక్ ఒంటి కాలిపై బ్యాలెన్స్ ఆపుకుంటూ ఒక్క చేత్తో బంతిని అందుకున్నాడు.
కానీ బ్యాలెన్స్ అవుట్ అవుతుండటంతో వెంటనే బంతిని గాల్లోకి ఎగరేశాడు. గ్రౌండ్ లోపలికి వచ్చి మళ్లీ బంతిని అందుకున్నాడు. మళ్లీ బ్యాలెన్స్ కోల్పుతున్నట్లు గమనించి మరోసారి బంతిని గాల్లోకి ఎగరేశాడు. అప్పుడు పక్కనే ఉన్న ఫీల్డర్ హోస్ ఆ బంతిని అందుకుని క్యాచ్‌ను కంప్లీట్ చేశాడు. ఇలా సిక్స్ వెళ్తున్న బంతిని రెండు సార్లు బ్యాలెన్స్ తప్పినా.. క్యాచ్‌పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయడం విశేషం. 42 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి అదరగొట్టాడు. మరి ఈ మ్యాచ్‌లో బ్రూక్ చేసిన ఫీల్డింగ్ విన్యాసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a catch by Harry Brook! pic.twitter.com/QQUYZEnBOD
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023