SNP
Harmanpreet Kaur, WBBL 2024, Cricket News: భారత కెప్టెన్‌కు ఘోర అవమానం జరిగింది. వైస్ కెప్టెన్‌ను నెత్తిన పెట్టుకున్న వారు.. కెప్టెన్‌ను మాత్రం అవమానించారు. అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Harmanpreet Kaur, WBBL 2024, Cricket News: భారత కెప్టెన్‌కు ఘోర అవమానం జరిగింది. వైస్ కెప్టెన్‌ను నెత్తిన పెట్టుకున్న వారు.. కెప్టెన్‌ను మాత్రం అవమానించారు. అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్‌కు ఘోర అవమానం జరిగింది. ఈ స్టార్ ప్లేయర్‌ను ఉమెన్ బిగ్ బాష్ లీగ్ 2024 డ్రాఫ్ట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అమ్ముడుపోలేదు. 35 ఏళ్ల కౌర్.. మెల్‌బోర్న్ రెనిగేట్స్ ఉమెన్, సిడ్నీ థండర్స్ జట్లకు గతంలో కౌర్ ప్రాతినిధ్యం వహించింది. డబ్ల్యూబీబీలో మొత్తం 62 117.16 స్ట్రైక్ రేట్‌తో 1440 పరుగులు చేసింది. ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కౌర్‌ను.. ఇప్పుడు ఏ టీమ్ కూడా తీసుకునేందుకు సిద్ధంగా లేదు. ఇది ఆమెకు జరిగిన ఘోర అవమానంగా భావించవచ్చు. అయితే.. ఓ ఆరుగురు భారత మహిళా క్రికెటర్లు మాత్రం.. డబ్ల్యూబీబీఎల్ డ్రాఫ్ట్‌లో స్థానం పొందారు. అందులో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఉంది.
టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న కౌర్.. అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా జరగనున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లోనూ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. భారత వేదికగా జరిగే.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభ ఏడాది 2023లో ముంబయి ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపింది. 2024 సీజన్‌లో కూడా కౌర్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఫైనల్ ఆడింది. హర్మన్‌ప్రీత్‌తో పాటు శ్రేయాంక పాటిల్‌ను కూడా బిగ్ బాష్ జట్లు వద్దనుకున్నాయి. 22 ఏళ్ల పాటిల్ డబ్ల్యూపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడింది. మొత్తం 15 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు సాధించింది. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో 15 వికెట్లు కూడా సాధించింది.
పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతోనే పాటిల్‌ను బిగ్ బాష్ టీమ్స్ వద్దనుకున్నట్లు సమాచారం. ఆసియా కప్‌లో ఆమె ఎడమ చేతి వేలికి గాయం అయింది. ఆశా శోభన, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సబ్బినేని, వేద కృష్ణమూర్తి కూడా డ్రాఫ్ట్‌లో లేరు. జెమిమా రోడ్రిగ్స్, శిఖా పాండేలను బ్రిస్బేన్ హీట్ జట్టులోకి తీసుకోగా, మెల్బోర్న్ స్టార్స్.. దీప్తి శర్మ, యాస్తికా భాటియాను తమ టీమ్‌లోకి తీసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానతో అడిలైడ్ స్ట్రైకర్స్ గతంలోనే ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దయాళన్ హేమలతను పెర్త్ స్కార్చర్స్ తీసుకుంది. మరి హర్మన్ ప్రీత్ కౌర్ బిగ్ బాష్‌లో అమ్ముడుపోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harmanpreet Kaur and Shreyanka Patil go unsold in the WBBL—unexpected turns in the draft! 😳 pic.twitter.com/Dx3WTCEGmc
— CricketGully (@thecricketgully) September 1, 2024
Here are the Indian players who will feature in the WBBL 2024 🌟🇮🇳
Harmanpreet Kaur did not get picked by any team 😮👀#WBBL2024 #HarmanpreetKaur #India #BigBash #Sportskeeda pic.twitter.com/4o7aeuxgZi
— Sportskeeda (@Sportskeeda) September 1, 2024